టాలీవుడ్ ప్రేక్షకులకు దిల్ రాజు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి సమ్మర్ లోపు రిలీజ్!
కరోనా థర్డ్ వేవ్ కారణంగా, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా జనవరి మొదటి వారంలో చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు కరోనా కేసుల తగ్గుదల క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలను ఎత్తి వేస్తున్నారు. దీంతో సినిమాలు అన్నీ మళ్ళీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొన్ని వివరాలు వెల్లడించారు.

ఎప్పుడు రిలీజ్ అంటే
కరోనా కారణంగా తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు అయిన 'RRR', 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి 'పాట', 'ఆచార్య' లాంటి పెద్ద హీరోల సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. తెలుగులోనే కాక తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ దెబ్బతో అన్ని భాషల స్టార్ హీరోలంతా దేశవ్యాప్తంగా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా, తమ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలి అని ఎదురు చూస్తున్నారు.

ఫిబ్రవరి ఎండింగ్ నుంచి
ఇక ఈ విషయం మీద హీరోలు, హీరోల అభిమానులు ఆనంద పడేవిధంగా పెద్ద సినిమాల రిలీజ్ లపై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. "ఫిబ్రవరి ఎండింగ్ నుంచి సినిమా రిలీజ్ లు ఉంటాయి. నిర్మాతలందరూ డేట్స్ సరిచూసుకుని సినిమాలను విడుదల చేస్తారు, సమ్మర్ లోపు పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి అని అన్నారు.

అండర్ స్టాండింగ్ తో ముందుకు
ఇక ఆంధ్ర ప్రదేశ్ టికెట్ల విషయంగా మాట్లాడుతూ ఈ విషయం మీద పాజిటివ్ గా ఉన్నాం... అన్నీ అయిపోతాయి... ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు.. అన్ని ప్రాసెస్ లు జరిగిపోతున్నాయి. ఆ ఇష్యూ కూడా సాల్వ్ అవ్వొచ్చు" అని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 25 నుండి పెద్ద సినిమాలు రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నాం, మార్చి, ఏప్రిల్ కల్లా పెద్ద సినిమాలు అన్నీ వచ్చేస్తాయి. డేట్లు మాట్లాడుకుని ప్లాన్ చేసుకుంటాం, ఒక అండర్ స్టాండింగ్ తో ముందుకు వెళ్తామని అన్నారు.

ఆశిష్ హీరోగా
ఇక రౌడీ బాయ్స్ సినిమాతో దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమా ను నిర్మించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ బాయ్స్ సినిమా కలెక్షన్స్ ఎంత అనేది దిల్ రాజు వెల్లడించారు.

రౌడీ బాయ్స్ కలెక్షన్స్
మొదటి వారం రౌడీ బాయ్స్ సినిమా 8.3 కోట్ల గ్రాస్ ను అందుకుందని, రెండో వారంలో 3.98 కోట్లందుకుని రెండు వారాలకు కలిపి 12 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందని అన్నారు. మూడో వారం, నాలుగో వారం కలిపి మరో 3 కోట్ల గ్రాస్ వస్తుందని ఆశిస్తున్నామని దిల్ రాజు అన్నారు. మొత్తంగా ఓ కొత్త హీరో 15 కోట్ల గ్రాస్ వసూలు చేశాడు. అది కూడా మొదటి సినిమాతో అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











