twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎఫ్ 3’లో రవితేజ యాడ్ అవుతారా? రిలీజ్ ఎప్పుడు... క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

    |

    Recommended Video

    Dil Raju Clarifies On Ravi Teja In F3 Movie | Filmibeat Telugu

    వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'ఎఫ్ 2' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. మీడియం బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ సాధంచడంతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

    త్వరలో 'ఎఫ్ 3' తీస్తామని దిల్ రాజు, అనిల్ రావిపూడి అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎవరైనా హీరోలు ఇందులో యాడ్ అవుతున్నారా? అనేది అంశంపై తాజాగా ప్రెస్ మీట్లో దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

    ఇది మా సంస్థకు పెద్ద బూస్టప్

    ఇది మా సంస్థకు పెద్ద బూస్టప్

    2019 సంక్రాంతి మా బేనర్‌కు ఒక బిగ్ బూస్టప్ ఇచ్చింది. 2017లో మా సంస్థ నుంచి 6 బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చి మ్యాజిక్ జరిగింది. మళ్లీ 2019 సంక్రాంతికి ‘ఎఫ్ 2' ద్వారా ఇంత పెద్ద బూస్టప్ రావడం హ్యాపీగా ఉందని దిల్ రాజు తెలిపారు.

    ఇంత పెద్ద హిట్టవుతుందనుకోలేదు

    ఇంత పెద్ద హిట్టవుతుందనుకోలేదు

    ఒక మంచి సినిమా తీస్తున్నాం, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని అనిల్ స్టోరీ చెప్పినపుడు అనిపించింది. సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు సూపర్ హిట్ అనే నమ్మకం వచ్చింది. కానీ అంతకు మించి ఈ రోజు తెలుగు ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా మాసు, క్లాసు అనే తేడా లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మంచి పొజిషన్లో నిలిచిన సినిమా కావడం ఆనందంగా ఉందన్నారు.

    అందరికీ థాంక్స్..

    అందరికీ థాంక్స్..

    దర్శకుడు అనిల్ రావిపూడికి మా సంస్థ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్. వెంకటేష్, వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, టెక్నీషియన్లకు అందరికీ పేరు పేరునా థాంక్స్. మీడియా వారు కూడా ఈ సినిమాను ముందు నుంచీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సినిమా రిలీజ్ రోజు కూడా మెసేజ్ పంపడం, అప్రిషియేట్ చేయడం మరింత సంతోషాన్ని ఇచ్చింది దిల్ రాజు తెలిపారు.

    ఎఫ్ 3లో రవితేజ ఉన్నాడా? రిలీజ్ ఎప్పుడు?

    ఎఫ్ 3లో రవితేజ ఉన్నాడా? రిలీజ్ ఎప్పుడు?

    2021 సంక్రాంతికి ‘ఎఫ్ 3' రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కానీ అన్నీ మెటీరియలైజ్ అవ్వాలి. దాదాపు ఇదే టీమ్‌తో చేస్తామని దిల్ రాజు తెలిపారు. ‘ఎఫ్ 3'లో రవితేజ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది? అనే ప్రశ్నకు స్పందిస్తూ ఈ సినిమాకు ఇంకో హీరో యాడ్ అవ్వాలి. ఎవరు అనేది ఇప్పుడే చెప్పలేను. స్క్రిప్టు ఎలా మెటీరియలైజ్ అవుతుంది అనే దాన్ని బట్టి ‘ఎఫ్ 3' ఉంటుందన్నారు.

    English summary
    "Clarity comes when the script is completed." Dil Raju on Ravi Teja in F3 Movie with Venkatesh and Varun Tej.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X