దిల్ రాజే.. కోసేసుకున్నాడేటి!?
మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రసాద్ లాబ్స్‌లో రిలీజ్ చేశారు. కృష్ణ బర్త్ డే కేకును ఆయనే కోసేసి....టీజర్‌ను కూడా ఆయన రిలీజ్ చేశారు. అసలు ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్ బాబు, వెంకీ హాజరవుతారని అంతా అనుకున్నారు. కానీ వారెవరూ హాజరు కాలేదు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..కృష్ణ గారి పుట్టిన రోజున ఈ టీజర్ విడుదల చేయాలని ఎప్పటి నుంచో నా ఆశ. ఆయన 25 సంవత్సరాల క్రితం ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు చేశారు. అదే 25 సంవత్సరాల తర్వాత వారి అబ్బాయి మహేష్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చేయడం ఆనందంగా ఉంది అన్నారు.
దాదాపు 35 శాతం షూటింగు పూర్తయింది. జూన్‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో షూటింగు ఉంటుంది. ఆగస్టుకల్లా షూటింగు తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో సినిమాని విడుదల చేస్తామని తెలిపారు. మా బ్యానర్లో వచ్చే చిత్రాలన్నీ కథా బలంతో ఉంటాయి. ఈచిత్రం కూడా అంతే. మా బ్యానర్లో చెప్పుకోదగ్గ చిత్రాల లిస్టులో ఈ చిత్రం చేరుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. వెంకీ సరసన జర్నీ ఫేం అంజలి నటిస్తుండగా... మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్. ఈచిత్రానికి ప్రముఖ ఫోటోగ్రాఫర్‌గా గుహన్ పని చేస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











