ఎంత హింసించావో నాకు తెలుసు.. అవన్నీ మరిచిపోతున్నాం.. విరూపాక్ష డైరెక్టర్ గురించి దిల్ రాజు
కొత్త టాలెంట్‌తో విరూపాక్ష సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన నా బ్రదర్ సాయిధరమ్ తేజ్, నా ఫ్రెండ్ బాపిరాజు, కొత్త డైరెక్టర్ కార్తీక్ దండును అభినందించేందుకు వచ్చాను. ఇందాక సీడెడ్ డిస్టిబ్యూటర్ మాట్లాడారు. ఆయనను ఎప్పుడూ చూడలేదు. విరూపాక్ష పోస్టర్ చూసి సినిమా కొన్నానని చెప్పాడు. సినిమా పోస్టర్ చూసి హిట్టవుతుందని గెస్ చేసిన ఆయనకు నా అభినందనలు. సీడెడ్ ప్రొడ్యూసర్‌లో నన్ను నేను చూసుకొన్నాను అని విరూపాక్ష సినిమా థ్యాంక్యూ మీట్‌లో దిల్ రాజు అన్నారు.
సినిమా పోస్టర్ చూసి: సీడెడ్ డిస్ట్రిబ్యూటర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను కూడా నీలానే ఎదిగాను. ఒక సినిమా పోస్టర్‌ను చూసి మూవీని జడ్జ్ చేయడం సినిమాపై నీకు ఉన్న అవగాహన. మీరు ఇలానే హిట్లు సాధించాలి. సినిమాకు మొదటి స్క్రిప్టు కావొచ్చు. ఆడియెన్స్‌కు మేము పంపించే లుక్‌ను అంచనాలు ఏర్పడుతాయి. కార్తీక్ దండు టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అటెన్షన్‌ను క్రియేట్ చేశారు అని దిల్ రాజు చెప్పారు.
నీలో నన్ను చూసుకొన్నాను అంటూ: విరూపాక్ష ట్రైలర్‌ను ప్రసాద్ ఐమాక్స్‌లో రిలీజ్ చేసినప్పుడే నేను ఈ సక్సెస్‌ను ఊహించాను. ఈ సినిమా విషయంలో ఏదో జరుగబోతుందని ఊహించాను. దర్శకుడు కార్తీక్ దండుకు థ్యాంక్స్. కొత్త డైరెక్టర్‌గా కథ రాసుకొని ఎంతమందిని హింస పెడితే.. ఈ అవుట్ పుట్ వచ్చిందో నాకు తెలుసు. డీవోపీ, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ బాగా పనిచేయడం ద్వారా ఈ సినిమా ఇంత హిట్ అయింది. వారందరికి నా థ్యాంక్స్ అని దిల్ రాజు అన్నారు.

దర్శకుడు చాలా కష్టపెట్టి ఉంటాడు: విరూపాక్ష సినిమాను హిట్ చేయడానికి నిర్మాతను కూడా దర్శకుడు కార్తీక్ చాలా కష్టపెట్టి ఉంటాడు. కానీ ఈ రోజు సూపర్ హిట్ వచ్చింది కాబట్టి అవన్నీ మరిచిపోతున్నాం. నిర్మాతలు ప్రసాద్, బాపిరాజుకు థ్యాంక్స్. ఇండస్ట్రీకి వెంకీ అట్లూరిని ఇచ్చారు. ఇప్పుడు కార్తీక్ దండును అందించారు. నీ కథతో ప్రేక్షకులను కనికట్టు చేశావు అని దిల్ రాజు అన్నారు.

క్లైమాక్స్ చూస్తున్నప్పుడు వావ్ అనేలా: విరూపాక్షలో హీరోయిన్‌గా నటించిన సంయుక్త మీనన్‌ను చూస్తూ.. మిమ్మల్ని హీరోయిన్ అనాలా? లేదా విలన్ అనాలా? అని తెలియడం లేదు. క్లైమాక్స్ చూస్తున్నప్పుడు వావ్ అనిపించింది. హీరోయిన్ ఆ రేంజ్‌లో చేయించినందుకు కార్తీక్ దండును అభినందిస్తున్నాను. తేజు కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా సినిమాను తీశారు. నేను తేజుతో సినిమా చేయాలంటే కష్టంగానే ఉంది అని దిల్ రాజు చెప్పారు.

సాయిధరమ్ తేజ్‌కు పునర్జన్మ: సాయిధరమ్ తేజ్‌కు తన కెరీర్‌లో బిగ్ సక్సెస్. జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తాయి. యాక్సిడెంట్‌ను తప్పించుకొన్నావు. భగవంతుడు నీకు పునర్జన్మను ఇవ్వడమే కాకుండా ఇంత పెద్ద హిట్ ఇచ్చారు.అందంతా నీ మంచితనం వల్లే అని నేను అనుకొంటాను. ఈ విజయయాత్రను ఇలానే కొనసాగించు అని దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











