పోటీ రావడం ఇష్టం ఉండదు, దయచేసి మెగా చిచ్చు పెట్టొద్దు: మీడియా ముందుకు దిల్ రాజు!

By Bojja Kumar

మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రాలు 'ఇంటిలిజెంట్', 'తొలి ప్రేమ' ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఇద్దరూ తాము అభిమానించే ఫ్యామిలీ హీరోలే కావడంతో ఏ సినిమాకు వెళ్లాలి అనే సందేహంలో పడిపోయారు. మరో వైపు మీడియాలో మెగా హీరోల మధ్య 'క్లాష్' అంటూ వార్తలు మార్మోగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అయోమయాన్ని తొలగించడంతో పాటు...... రెండు సినిమాల మధ్య సెటిల్మెంట్ చేందుకు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రంగంలోకి దిగారు.

Recommended Video

అచ్చం..పవన్ ను చూసినట్లే ఉంది కదూ ! ‘తొలి ప్రేమ’ ఫస్ట్ లుక్
మిస్ కమ్యూనికేషన్ వల్లే ఇలా జరిగింది: దిల్ రాజు

మిస్ కమ్యూనికేషన్ వల్లే ఇలా జరిగింది: దిల్ రాజు

దిల్ రాజు మాట్లాడుతూ..... ‘తొలి ప్రేమ, ఇంటలిజెంట్ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అనేదాని మీద చాలా రోజుల నుండి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో కన్ ఫ్యూజన్ ఉంది. మిస్ కమ్యూనికేషన్ వల్లే ఈ రెండు సినిమాల ఒకేరోజు ఫిబ్రవరి 9న రిలీజ్ డేట్ పెట్టుకోవాల్సి వచ్చింది అని దిల్ రాజు తెలిపారు.

పోటీ రావడం నాకు ఇష్టం ఉండదు

పోటీ రావడం నాకు ఇష్టం ఉండదు

సినిమా ఫీల్డులో ఒక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఎప్పుడూ పోటీ రావడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతి సినిమాకు కష్టపడి చేస్తాం. దాని ద్వారా రెవెన్యూ తీసుకురావడమే ముఖ్యం. అది నేను తీసిన సినిమా అయినా, పక్కవారి సినిమా అయినా, నేను కొన్న సినిమా అయినా... ఇదే కోరుకుంటాను. కొన్ని పరిస్థితుల వల్ల ఇలా ఒకేసారి రెండు సినిమాలు రావాల్సిన అవసరం వస్తుంది.... అని దిల్ రాజు తెలిపారు.

ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువయ్యారు

ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువయ్యారు

తెలుగు సినీ పరిశ్రమలో ఇపుడు హీరోలు కూడా ఎక్కువ మంది అయిపోయారు. ఒక్కో హీరో మూడు మూడు సినిమాలు చేస్తున్నారు. నెంబరాఫ్ మూవీస్ పెరిగాయి. 80ల్లో చూస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది. ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు వచ్చేవి. అయితే క్రమంగా అది తగ్గింది. ఈ మధ్య సంవత్సర కాలంగా సినిమాలు మళ్లీ పెరిగాయి. రన్ కూడా బాగా తగ్గిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లోనే రెండు సినిమాలు క్లాష్ కావడం, ప్యారలల్ రిలీజ్ కావడం జరుగుతుంది.... అని దిల్ రాజు తెలిపారు.

దయచేసి మెగా హీరోల మధ్య చిచ్చు పెట్టొద్దు

దయచేసి మెగా హీరోల మధ్య చిచ్చు పెట్టొద్దు


ఇక్కడ పోటీ వల్లనో, మరొకదాని వల్లనో కాదు. ఇటు ప్రసాద్ గారికి, అటు కళ్యాణ్ గారికి..... మా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌‌కు ఎవరికీ ఆ ఇంటెన్షన్ ఉండదు. ఏం జరిగిందో మేము క్లారిటీగా చెప్పకుండా కమ్యూనికేషన్ సరిగా లేనపుడు మీడియా ద్వారా ఇలాంటి వార్తలు రావడం సహజం. దయచేసి మెగా హీరోల మధ్య చిచ్చు పెట్టవద్దు అని దిల్ రాజు తెలిపారు.

అంతా సెట్ చేశాం

అంతా సెట్ చేశాం


‘తొలి ప్రేమ' సినిమాను నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ‘ఇంటిలిజెంట్' 9వ తేదీన వస్తున్నపుడు మనం 10న వద్దామని నిర్మాత ప్రసాద్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం కళ్యాణ్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఇదే అడుగుదామనే ఇంటెన్షన్ లోనే ఉన్నారు. మెగా అభిమానులు కూడా ఒకేసారి రెండు సినిమాలు విడుదలైతే ఏ సినిమాకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. దాన్ని అయినా ఎవాయిడ్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఇంటిలిజెంట్ 9వ తేదీన విడుదలైతే, తొలి ప్రేమ 10న విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇపుడు అంతా సెట్టయిపోయింది అని దిల్ రాజు తెలిపారు.

‘తొలి ప్రేమ’ ది బెస్ట్ మూవీ అవుతుంది

‘తొలి ప్రేమ’ ది బెస్ట్ మూవీ అవుతుంది

తొలి ప్రేమ సినిమా వారం క్రితం చూపించారు. నా బేనర్ నుండి వచ్చే సినిమాకు ప్రెస్ మీట్లో నా ఫీలింగ్ ఏమిటి అనేది చెబుతుంటాను. తొలి ప్రేమ చూసిన తర్వాత ఇది ప్రసాద్ గారి బేనర్లో బెస్ట్ సినిమా అవుతుందనే ఫీలింగ్ వచ్చింది. అత్తారింటికి దారేది, డార్లింగ్ లాగా తొలిప్రేమ వారి బేనర్ కు బెస్ట్ మూవీ అవుతుంది. వరుణ్ కూడా ఆఫ్టర్ ‘ఫిదా' మంచి సక్సెస్ ఫుల్ సినిమా వస్తోంది. తొలి ప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.... అని దిల్ రాజు తెలిపారు.

గతేడాది ఫెయిల్ అయ్యాను

గతేడాది ఫెయిల్ అయ్యాను

గతేడాది డిస్ట్రిబ్యూటర్‌గా నాకు కలిసి రాలేదు. ఈ ఏడాది భాగమతితో మొదలు పెట్టాం మంచి పర్సంటేజ్ వచ్చింది. ఇపుడు వెంటనే ‘తొలి ప్రేమ' వచ్చింది. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఫాంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది.... అని దిల్ రాజు తెలిపారు.

ఓవర్సీస్‌లో ఒక రోజు ముందే

ఓవర్సీస్‌లో ఒక రోజు ముందే


‘తొలి ప్రేమ' 10వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్‌లో 9వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ‘శతమానం భవతి', ‘హ్యాపీ డేస్' చిత్రాలు ఒకరోజు కంటే ముందే విడుదల చేశాం. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాను. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి అక్కడ అవసరం అనుకుంటే ఒక రోజు ముందే విడుదల చేస్తాం.

ఇగో అనేది ఉండకూడదు

ఇగో అనేది ఉండకూడదు

‘తొలి ప్రేమ' నిర్మాత బివిఎస్ఎన్ నిర్మాత మాట్లాడుతూ... సినిమాల మధ్య ఇగో అనేది ఉండకూడదు. దిల్ రాజుగారు మన సినిమాను 10న విడుదల చేద్దాం అనగానే సంతోషం అనిపించింది. మెగా అభిమానుల మధ్య కన్ ఫ్యూజన్ తొలగించినట్లు అవుతుందని నేను కూడా ఓకే చెప్పాను అని తెలిపారు.

ఇంటిలిజెంట్

ఇంటిలిజెంట్

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటిలిజెంట్‌‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది.

తొలి ప్రేమ

తొలి ప్రేమ

వ‌రుణ్‌తేజ్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం `తొలి ప్రేమ‌`. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X