twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ నిబద్దతపై దిల్ రాజు లేవనెత్తిన సందేహం, అది వట్టి మాటేనా?

    |

    Recommended Video

    అజ్ఞాతవాసి నిజంగా పవన్ ఆఖరి సినిమా నా ?

    సినిమా-రాజకీయం రెండింటిని ఏక కాలంలో బ్యాలెన్స్ చేయాలనుకోవడం కష్ట సాధ్యమే. ఎందుకు.. బాలకృష్ణ, రోజా లాంటివాళ్లు రెండింటిలోను రాణించట్లేదా? అన్న ప్రశ్న వేయవచ్చు. కానీ రాజకీయాల్లో వాళ్ల పాత్ర పార్టీ నిర్ణయాల మేరకే లోబడి ఉంటుందన్నది విస్మరించలేం.

    అలా కాకుండా తానే పార్టీ వ్యవస్థాపకుడిగా బయలుదేరినప్పుడు.. కచ్చితంగా ఎక్కువ సమయం వెచ్చించక తప్పని పరిస్థితి. క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న పవన్ కల్యాణ్‌కు ఇప్పుడిదే సంకటం ఎదురవుతోంది. అటు సినిమా, ఇటు రాజకీయం.. రెండింటిలో ఎటూ తేల్చుకోలేక చాన్నాళ్లు సతమతమయ్యారు.

    అది నాకు తీరని లోటు.., వాళ్లను కాపాడుకుంటా, నిర్మాతగా సక్సెస్.. కానీ!: దిల్ రాజుఅది నాకు తీరని లోటు.., వాళ్లను కాపాడుకుంటా, నిర్మాతగా సక్సెస్.. కానీ!: దిల్ రాజు

    దిల్ రాజు కామెంట్‌తో:

    దిల్ రాజు కామెంట్‌తో:

    పార్ట్ టైమ్ రాజకీయాలు పనికిరావన్న విమర్శలు పెరిగిపోవడంతో రెండు పడవల ప్రయాణానికి స్వస్తి చెప్పాలని ఆయన భావించారు. ఈ క్రమంలోనే అజ్ఞాతవాసి తన ఆఖరి సినిమా అని ప్రకటించేశారు కూడా. ఇలాంటి తరుణంలో నిర్మాత దిల్ రాజు చేసిన ఓ వ్యాఖ్య పవన్ వైఖరిపై సందేహాలను లేవనెత్తేలా మారింది.

    దిల్ రాజు ఏమన్నారు:

    దిల్ రాజు ఏమన్నారు:

    సోమవారం దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. 'రాజూ.. నీతో సినిమాకు నేనెప్పుడైనా రెడీ.. నా రాజకీయాలతో అనవసరం..' అని పవన్ మాట ఇచ్చినట్లు చెప్పారు.

     అంటే.. అది వట్టి మాటేనా?:

    అంటే.. అది వట్టి మాటేనా?:

    దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అజ్జాతవాసి తన ఆఖరి సినిమా అని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన వట్టిదేనా? అన్న సందేహాం తలెత్తకమానదు. రాజకీయాలతో సంబంధం లేకుండా తనతో సినిమా చేస్తానన్నారని దిల్ రాజు అంత స్పష్టంగా చెప్పడం దీనికి ఊతమిచ్చింది.

     గతంలోను ఇలా:

    గతంలోను ఇలా:

    పవన్ కల్యాణ్ గతంలోను చాలామంది నిర్మాతలకు మాట ఇచ్చారు. దివంగత దర్శక రత్న దాసరి నారాయణరావుతోను, ఎం.ఎం.రత్నం లాంటి నిర్మాతలతోనూ సినిమాలు చేస్తానన్నారు. అయితే ఆ వాగ్దానాలన్ని ఆచరణ రూపం మాత్రం దాల్చలేదు. కాబట్టి దిల్ రాజుకు పవన్ ఇచ్చిన మాట కూడా అలాగే కనుమరుగువుతుందా? అన్నది కూడా కొట్టిపారేయలేం.

     వేచి చూడాలి:

    వేచి చూడాలి:

    'మూడు నెలలకోసారి వచ్చి మాట్లాడితే సరిపోదు..' అన్న విమర్శలను ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో ఉన్నన్ని రోజులు తనను సీరియస్ పొలిటీషియన్‌గా పట్టించుకునే అవకాశం లేకపోవడంతోనే.. సినిమాలకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. అదే క్రమంలో అభిమానులు, కార్యకర్తల ముందు అజ్జాతవాసి ఆఖరి సినిమా అని ప్రకటించేశారు. మరి పవన్ ఇదే మాటపై నిలబడుతారో లేదో వేచి చూడాలి.

    English summary
    In an interview Dil Raju very clearly said that Pawan Kalyan promised to him to do a movie, but recently Pawan Kalyan announced that Trivikram's movie is his last one, both comments were confusing fans now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X