ఎన్టీఆర్, నేను ఎన్నో కథలు విన్నాం.. చివరికి
ఎన్టీఆర్, నేను ఎన్నో కథలు విన్నా..చివరికి వంశీ చెప్పిన కథ నచ్చింది. 'మున్నా"లాంటి సినిమా తర్వాత వంశీకి పూర్తి క్రేజ్ పెంచే చిత్రమిది. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్. ఎన్టీఆర్‌కి వైవిధ్యమైన సినిమా. పాటల్లో కొత్తగా కనిపిస్తారు. చోటా.కె.నాయుడు కెమెరాపనితనం, మార్తాండ్ ఎడిటింగ్, తమన్ సంగీతం..ఇలా అన్నీ బాగా సమకూరాయి అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన ఎన్టీఆర్ హీరోగా కాజల్, సమంత హీరోయిన్స్ గా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనం" పాటలు ఈనెల 12న విడుదల కానున్నాయి. వేదిక హైదరాబాద్ శిల్పకళావేదిక. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...'వెంకటేశ్వరా క్రియేషన్స్ బేనర్‌కు ప్రతిష్ఠాత్మక చిత్రమిది. ఈ ఏడాది టాప్3లో ఉండే సినిమా. ఈనెల 10తో స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న పాట చిత్రీకరణ పూర్తవుతుంది. దాంతో పాటల చిత్రీకరణ సహా సినిమా పూర్తయినట్టే. 12న పాటలు, అక్టోబరు ఒకటిన సినిమా విడుదల చేస్తాం. అలాగే ఎన్టీఆర్, కోట, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, శ్రీహరి..నటనతో పూర్తిభోజనంలా సినిమా ఉంటుంది. కాజల్, సమంతల నటన ప్రత్యేకంగా ఉంటుంది. వినోదం ఆశించి వచ్చేవారందరికీ చక్కని సినిమా. తుది ఫలితం చూసే ఇలా చెబుతున్నా. అతివిశ్వాసం కాదు. గణాంకాలు, సమీక్షలు, విమర్శనలు ముగిశాక చెబుతున్న అభిప్రాయమిది" అన్నారు. దిల్ రాజు కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఓ గొప్ప సినిమా చూడబోతున్నామనే ఆలోచనలో అందరిలో కలగుతోంది. అది నిజం కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











