Game Changer: ఇండియన్ 2 డిజాస్టర్.. దిల్ రాజుకి శంకర్ పై అంత నమ్మకమా?

ఈ ఏడాదిలో సౌత్ ఇండియా సినిమా నుంచి వచ్చిన పలు భారీ చిత్రాలు చాలానే ఉన్నాయి. కాగా వీటిలో హిట్స్ మాత్రం కొంచెం తక్కువే అని చెప్పాలి. కాగా ఈ ఏడాదిలో వచ్చిన ఈ సినిమాల్లో పలు సీక్వెల్స్ కూడా ఉండగా వాటిలో ఆడియెన్స్ ని డిజప్పాయింట్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది సెన్సేషనల్ దర్శకుడు శంకర్ అండ్ ఉలగనయగన్ కమల్ హాసన్ ల కాంబినేషన్ నుంచి వచ్చిన చిత్రం "ఇండియన్ 2" అని చెప్పాలి.

కాగా ఈ చిత్రం 1996 లో వచ్చిన క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఇండియన్ కి సీక్వెల్ గా ఇన్నేళ్లకి ఈ ఏడాదిలో వచ్చింది. మరి ఈ చిత్రం శంకర్ మార్క్ లోనే భారీతనంతో తెరకెక్కింది కానీ కాన్సెప్ట్ మిస్ ఫైర్, బోరింగ్ కథనాలతో ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిపోయింది. అయితే ఒక్క సౌత్ లోనే కాదు ఇండియన్ సినిమా దగ్గరే ఎన్నో ఐకానిక్ సినిమాలు తీసిన శంకర్ కే దారుణమైన ట్రోలింగ్ ప్రెజెంట్ జెనరేషన్ నెటిజన్స్ నుంచి తప్పలేదు.

dil raju confidence on game changer event indian 2 flop from shankar

దీనితో దీని ఎఫెక్ట్ తన తదుపరి చిత్రం "గేమ్ ఛేంజర్" పై పడింది. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అటు శంకర్ కి ఇటు రామ్ చరణ్ కి కూడా 15వ సినిమాగా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో 50 వ సినిమా.. పైగా శంకర్ మొట్ట మొదటి తెలుగు సినిమా కూడా ఇదే కావడంతో మొదట్లో భారీ హైప్ ఈ సినిమాపై నెలకొంది. కానీ సమయం ఎక్కువ అవుతుంది. ప్రమోషనల్ కంటెంట్ తక్కువ బయటకి వచ్చింది.

ఇంకో పక్క ఇండియన్ 2 ఫలితం శంకర్ ని అలాగే గేమ్ ఛేంజర్ సినిమాని కూడా చాలా ఎక్కువ టార్గెట్ అయ్యేలా చేసాయి. వీటితో నిర్మాత దిల్ రాజుకి కూడా ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. కానీ దిల్ రాజు తాజగాతాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ వింటే మెగా అభిమానులకి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. కాగా దిల్ రాజు రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అవుతుంది అని సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది అని తెలిపారు.

అలాగే ఈ చిత్రం ఖచ్చితంగా రామ్ చరణ్, శంకర్ సార్ల ప్రస్తుత ఇమేజ్ ని మార్చే విధంగా ఉంటుంది. మొత్తం ఇండియన్ పాలిటిక్స్ కి సంబంధించిన పాయింట్ తో సినిమాని చేసాం. ఖచ్చితంగా మేము అనుకున్న రిజల్ట్ సాధిస్తాం పెద్ద సక్సెస్ కొడతాం అంటూ కామెంట్స్ చేశారు. దీనితో అసలు ఇండియన్ 2 లాంటి ఘోరమైన ఫలితం తర్వాత కూడా దిల్ రాజు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే డెఫినెట్ గా తన పోడక్ట్ మీద గట్టి నమ్మకమే ఉందని చెప్పాలి.

మరి నిజంగానే ఈ సినిమా హిట్ అయితే ఇది ఒక్క మెగా ఫ్యాన్స్ కి మాత్రమే కాదు శంకర్ ఫ్యాన్స్ కి కూడా ఒక మరపురాని సినిమాగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. గత కొన్ని సినిమాలతో శంకర్ వర్క్ ని చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారు. వారి అందరికీ కూడా సమాధానం చెప్పాల్సింది "గేమ్ ఛేంజర్" ఒక్కడే అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: shankar indian 2 dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X