రామ్ చరణ్ కోసం గోవాలో దిల్ రాజు
రామ్ చరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంభందించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అందునిమిత్తం దిల్ రాజు, దేవి, వంశీ పైడిపల్లి అక్కడ మకాం వేసారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లకు సూపర్ హిట్ సంగీతం అందించిన దేవి ఈ సారి చరణ్ కి అందించబోయే ఈ మ్యూజిక్ ని ఓ మ్యాజిక్ లా చెయ్యాలని భావించి చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది. ఇందులో చరణ్‌కి జంటగా సమంత నటించనున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత వీవీ వినాయక్ దర్శకత్వంలో చరణ్ నటిస్తారు.
ఇక ప్రస్తుతం చరణ్.. 'రచ్చ" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, తమన్నా కాంబినేషన్ లో సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం రచ్చ. ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే కధ రచ్చ. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగండి అంటున్నారు దర్శక, నిర్మాతలు. ఎన్వీ ప్రసాద్, పారాస్‌జైన్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. చరణ్‌కి సరిపడిన కథ ఇది. పూర్తిగా మాస్ అంశాల్ని మేళవించాం. ఇది వరకు చేసిన మూడు సినిమాల్లో కంటే విభిన్నంగా కనిపిస్తాడు. దర్శకుడు కథను తెరకెక్కిస్తున్న విధానం బాగుంది అన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్ సాయి.


Click it and Unblock the Notifications











