»   » దిల్ రాజు ఇంట్లోనూ మొదలైన పెళ్లి సందడి!

దిల్ రాజు ఇంట్లోనూ మొదలైన పెళ్లి సందడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో పలువురు స్టార్స్ ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి వివాహం డాక్టర్ ప్రణవ్ తో జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ప్రముఖ నటుడు బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహం శ్రీభరత్‌తో జరిగింది.

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఇంట్లోనూ పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు కూతురు వివాహం త్వరలో జరుగబోతోందని, ఇటీవల ఆయన సొంతూరైన నిజామాబాద్‌లో నిశ్చితార్థం కూడా జరిగిందని సమాచారం. అయితే ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి ఎవరికీ ఆహ్వానం అందలేదట. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా జరిగినట్లు తెలుస్తోంది.

త్వరలోనే కూతురు పెళ్లి వేడుక గ్రాండ్‌గా నిర్వహించేందుకు దిల్ రాజు సిద్ధం అవుతున్నారని సమాచారం. కాగా...దిల్ రాజు చూడటానికి చాలా యంగ్‌గా కనిపిస్తారు. ఆయనకు పెళ్లీడు కూతురు ఉందనే విషయం తెలిసి పరిశ్రమలో చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కాగా...ప్రస్తుతం దిల్ రాజు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాన్ని తన సొంతబేనరైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. మరో వైపు ఆయన రామ్ చరణ్ హీరోగా నిర్మించిన 'ఎవడు' చిత్రం విడుదల కావాల్సి ఉంది.

English summary
Film Nagar sources to believed Dil raju Daughter got engaged recently and this is an arranged marriage.Its hard to believe that Dil Raju is having a marriage age daughter as the producer appears like a less aged guy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu