»   »  పవన్ కళ్యాణ్ సిద్ధమే.. కానీ అసలు విషయమే కరువైంది!

పవన్ కళ్యాణ్ సిద్ధమే.. కానీ అసలు విషయమే కరువైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కల్యాణ్ హీరోగా దిల్ రాజు సినిమా చేయాలని చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దిల్ రాజుకు ఆ అవకాశం దక్కింది. ఆయనతో సినిమా ఓకే అవడం చాలా సంతోషంగా ఉంది, మంచి స్క్రిప్ట్ తోపాటు సమర్ధుడైన దర్శకుడి కోసం అణ్వేషిస్తున్నా అని దిల్ రాజు ఆ మధ్య మీడియా ముఖంగా ప్రకటన చేసారు కూడా.

పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా పూర్తి కాగానే... ఆయనతో సినిమా చేయాలని ఆశపడుతున్న దిల్ రాజుకు పరిస్థితులు అనుకూలించడం లేదట. పవన్ కళ్యాణ్‌‍కు సూటయ్యే, ఆయన మెచ్చే స్క్రిప్టు ఇప్పటి వరకు సంపాదించలేక పోయారట దిల్ రాజు. వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో ప్రత్యేకంగా ఓ బృందం పవన్ కళ్యాణ్ కోసం కథ తయారు చేసే పనిలో నిమగ్నమయి ఉన్నారట.

Dil Raju doesn’t any script suits for Pawan Kalyan

మిర్చి, శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివను సంప్రదించినా... ఆయన నా వద్ద పవన్ కళ్యాణ్ కు సూటయ్యే కథ ప్రస్తుతానికి లేదని చేతులెత్తేసారట. మరో వైపు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను పురమాయించినా ప్రస్తుతం అతను సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి కష్టమే అన్నట్లు సమాచారం.

తన పలుకుబడి ఉపయోగించి ఇండస్ట్రీలో పేరున్న రైటర్లు, డైరెక్టర్లందరికీ కబురు పంపి పవన్ కళ్యాణ్ కు సరిపోయే కథ కావాలని కోరారట. ఇప్పటి వరకు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్‍కు కథ తేక పోవడంతో దిల్ రాజు కాస్త టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ఆలస్యం అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్సవుతుందనేది దిల్ రాజు ఆందోళనగా కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ టాక్.

English summary
Pawan Kalyan has promised to do a movie for Dil Raju. But Dil Raju doesn’t have any script that suits Pawan Kalyan at the moment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu