Vakeel Saab Trailer బ్రేక్‌ ఫాస్ట్ మాత్రమే,9న లంచ్, డిన్నర్ చేద్దాం..జై పవర్ స్టార్ అంటూ జై కొట్టిన దిల్ రాజు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లోని థియేటర్లలతో మెగా అభిమానులు భారీ హంగామా మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతీ చోట అభిమానులు భారీగా తరలి వచ్చారు. బాణసంచా కాల్చి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగల మార్చి వేశారు. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రంలో దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరాం మాట్లాడుతూ..

జాన్వీ కపూర్ సెక్సీ అండ్ బ్యూటీఫుల్ ఫోటోషూట్..

 హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో

హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో

పవన్ కల్యాణ్ క్రేజ్‌ను, వకీల్ సాబ్ సినిమా మీద ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొన్న చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్‌ను థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మార్చి 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో ట్రైలర్‌ను ఆవిష్కరించి ప్రదర్శించారు.

 సుదర్శన్ థియేటర్‌లో అభిమానుల మధ్య

సుదర్శన్ థియేటర్‌లో అభిమానుల మధ్య

తెలుగు సినిమా చరిత్రలో థియేటర్లలో అభిమానులు మధ్య పలు ప్రాంతాల్లో ట్రైలర్‌ను ఆవిష్కరించే కొత్త సంప్రదాయానికి నిర్మాత దిల్ రాజు తెర తీశారు. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ ఆవిష్కరణకు దర్శకుడు వేణు శ్రీరాంతోపాటు నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అభిమానుల సందడి హైలెట్‌గా మారింది.

అరుపులు లేక మూడేండ్లు

అరుపులు లేక మూడేండ్లు

వకీల్ సాబ్ ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం నిర్మాత దిల్ రాజు భావోద్వేగానికి గురయ్యారు. జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అభిమానులతో మాట్లాడుతూ.. వకీల్ సాబ్ ట్రైలర్ సూపర్బ్‌గా ఉంది కదా.. ఈ అరుపుల లేక మూడు సంవత్సరాలు అయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.

బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే.. లంచ్ డిన్నర్..

బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే.. లంచ్ డిన్నర్..

వకీల్ సాబ్ ట్రైలర్ కేవలం బ్రేక్ ఫాస్ట్ మాత్రమే. లంచ్, డిన్నర్ ఏప్రిల్ 9వ తేదీన చేద్దాం. మీరంతా హ్యాపీనా,.. పవర్ స్టార్‌ను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మూడేళ్లు వేచి చూశాం. ఆ వెయిటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 9వ తేదీన ఇదే థియేటర్‌లో లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం అని అన్నారు.

 జై పవర్ స్టార్ అంటూ జై కొట్టిన వేణు శ్రీరాం

జై పవర్ స్టార్ అంటూ జై కొట్టిన వేణు శ్రీరాం

వకీల్ సాబ్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు వేణు శ్రీరాం మాట్లాడుతూ.. జై పవర్ స్టార్ అంటూ పవన్ కల్యాణ్‌కు జైకొట్టారు. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ట్రైలర్ బాగుందా. ట్రైలర్ బాగుంది కదా... సినిమా దీని కంటే చాలా చాలా బాగుంటుంది. ట్రైలర్‌ను ఎంజాయ్ చేసినట్లే సినిమాను ఆస్వాదిస్తారు. ఏప్రిల్ 9న తేదీకి రెడీ అవ్వండి అని వేణు శ్రీరాం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X