For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  1987లో సూట్ కేసుతో వచ్చా, 5 వేలకు కూడా కష్టపడ్డాం.... దిల్ రాజు ఎమోషనల్ స్పీచ్

  By Bojja Kumar
  |
  2017-దిల్ రాజు గ్రాండ్ పార్టీ.. సందడి చేసిన స్టార్స్!

  2017లో వరుసగా ఆరు విజయాలు అందుకున్న నిర్మాత దిల్ రాజు సోమవారం సాయంత్రం... సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకులో ఆరు సినిమాల్లో నటించిన నటీనటులతో పాటు సినీ పరిశ్రమ నుండి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దిల్ రాజు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా మొదలైందో చెప్పారు. ఒక ఏడాది ఇన్ని సినిమాలు చేయ‌డం చాలా కష్టం. దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్స్ సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. మా ఆఫీస్‌ స్టాఫ్ కూడా ఎంతో సహకారం అందించారని, మా సంస్థకు ఇన్ని స‌క్సెస్‌లు రావ‌డానికి వీరంతా కారణమని తెలిపారు.

  1987లో సూట్ కేసు పట్టుకుని వచ్చాను

  1987లో సూట్ కేసు పట్టుకుని వచ్చాను

  1987 డిసెంబ‌ర్‌లో నా జీవితం మొద‌లైంది. మొదటి సారి ఒక సూట్‌కేస్ ప‌ట్టుకుని ఆటోమొబైల్ ఫీల్డ్ గురించి బ‌య‌లుదేరారు. 1987, 1997, ఇప్పుడు 2017.. అన్నిటికి ఏదో ఇంట‌ర్‌లింక్ ఉన్న‌ట్టు అనిపిస్తోంది. 1987లో మొదలైన నాకు ఆటోమొబైల్ ఫీల్డులో వర్క్ చేసుకుంటూ వెలుతూ మేమంతా అసోసియేట్ అవ్వడం, సినిమాల మీద ఇంట్రెస్టుతో ఇండ‌స్ట్రీలోకి రావ‌డం, బిగినింగ్‌లో ఫెయిల్యూర్స్ అందరికీ తెలిసిందే... అని దిల్ రాజు తెలిపారు.

  సరిగ్గా 20 ఏళ్ల క్రితం తొలి సక్సెస్

  సరిగ్గా 20 ఏళ్ల క్రితం తొలి సక్సెస్

  సరిగ్గా 20 ఏళ్ల క్రితం మా జీవితంలో గ్రేట్ డే స‌క్సెస్ ఇదే క్రిస్మస్ రోజున వచ్చింది. పెళ్లిపందిరి సినిమాతో తొలి విజయం అందుకున్నాం. ఆ రోజు ఆ సక్సెల్ లేకుంటే ఈ రోజు ఈ ఆరు సక్సెస్‌లు నా లైఫ్ లో ఉండేవి కావు. ఆ సినిమా కొన్న‌ప్ప‌టి నుంచి రిలీజ్ వ‌ర‌కు ఎంత క‌ష్ట‌ప‌డ్డామో మాకు, మా ఫ్యామిలీస్‌కి తప్ప చాలా మందికి తెలియదు. ఆ రోజుల్లో రూ. 5 వేల కోసం కూడా వెతుక్కున్న రోజులు ఉన్నాయి. సినిమా విడుద‌ల రోజు రూ.3ల‌క్ష‌లు త‌క్కువ ఉంటే ఎన్నో షాప్‌లు తిరిగి కలెక్ట్ చేసి క‌ట్టిన రోజు మాకు ఇంకా గుర్తు ఉంది. అది డిసెంబర్ 25.... అందుకే మా లైఫ్ లో అది స్పెషల్ ఫిల్మ్. అందుకే కోడి రామకృష్ణ గారిని, జగపతి బాబుగారి, ఆ సినిమాకు పని చేసిన ఇతరులను పిలిచి సన్మానం చేయడం జరిగింది, ఆ సినిమా లేకుంటే మేం లేం. ఆ సినిమా ద్వారానే ఇక్క‌డి వ‌ర‌కు రాగ‌లిగాం... అని దిల్ రాజు తెలిపారు.

  అలా ప్రొడక్షన్ రంగంలోకి వచ్చాం

  అలా ప్రొడక్షన్ రంగంలోకి వచ్చాం

  ఆ త‌ర్వాత డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ పెట్టాక చాలా మంది నిర్మాత‌లు మంచి సినిమాలు ఇచ్చారు. రత్నంగారు, ఎన్వీ ప్రసాద్ గారు, జివిజి రాజుగారు ఇలా పలువురు నిర్మాతలు మాకు మంచి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఇచ్చారు. ఎన్నో సినిమాల‌తో అనుభ‌వం ఉన్న మేం ప్రొడ‌క్ష‌న్‌లోకి వ‌చ్చాం. తొలి సినిమా వినాయ‌క్‌తో దిల్ చేశాం. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాం. దిల్ ద్వారా పుట్టిన సుకుమార్, బోయ‌పాటి శ్రీను, భాస్క‌ర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల‌, వేణు.. ఇలా ఎనిమిది మందిని దర్శకులను ప‌రిచ‌యం చేశాం. ఇందులో ఒక్క ద‌ర్శ‌కుడు త‌ప్ప మిగిలిన వాళ్లంద‌రూ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కులే. అందుకు చాలా సంతోషంగా ఉంది. కథను నమ్ముకుని వెలుతున్నాం కాబట్టే మాకు ఇన్ని సక్సెస్ లు వచ్చాయి అని దిల్ రాజు తెలిపారు.

  నేను ఊహించలేదు

  నేను ఊహించలేదు

  ఈ ఇయ‌ర్ మా సంస్థ‌కు రెండు హ్యాట్రిక్‌లు వ‌స్తాయ‌ని నేను అనుకోలేదు. ఆరు సినిమాలు వ‌స్తాయ‌ని ఊహించలేదు. భ‌గ‌వంతుడు ఇలా డిజైన్ చేశారు. `శ‌త‌మానం భ‌వ‌తి`, `నేను లోక‌ల్‌` త‌ర్వాత అంద‌రికీ తెలిసిందే.. అప్ప‌టికి ప్లాన్డ్ గా ఉన్నాను. మిగిలిన సినిమాల‌న్నీ ప్లాన్‌గా ఉన్నాను. ఆరు సినిమాలు క‌నిపిస్తున్నాయి. వాట‌న్నిటినీ హిట్ చేయాల‌ని, నువ్వు ఈ ప్రాజుక్టు చూసుకోవాలి, నువ్వు ఇది చూసుకోవాలి అని అంద‌రం ప్లాన్ చేసుకుంటున్నాం. డీజే షూటింగ్ జ‌రుగుతుంటే అబుద‌మీకి వెళ్లాను. అక్క‌డి నుంచి ఫారిన్ వెళ్లాలి. ఫిదా అప్ప‌టికి రెండు షాట్‌లు చూశాను... అనుకోకుండా విషాద వార్త(భార్య మరణం) వినాల్సి వచ్చింది అని దిల్ రాజు తెలిపారు.

  ఆ సమయంలో నాకు మోరల్ సపోర్టు ఇచ్చారు

  ఆ సమయంలో నాకు మోరల్ సపోర్టు ఇచ్చారు

  ఆ వార్త విన్న వెంటనే ఇండియా వచ్చేశాను. ఫ్లైట్ దిగుతుంటే... అస‌లు ఏం జ‌రుగుతుందో, ఎలా అవుతుందో నాకు తెలియ‌లేదు. ఎక్క‌డ డ్రాప్ అవుతానోన‌ని అనుకున్నా. గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్రెండ్స్ లేకుంటే జీవితంలో మ‌నం ముందుకు వెళ్ల‌లేం. ఈ ఆరు స‌క్సెస్‌ల వెన‌కాల నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ ఉంది. ఎంద‌రో నాకు ఈ ఏడెనిమిది నెల‌ల నుంచి మోర‌ల్ స‌పోర్ట్ ఇచ్చారు. దాంతోనే నేను సాధించాను. ఇది నేను సాధించింది కాదు.... అని దిల్ రాజు తెలిపారు.

  వంశీ కేవలం డైరెక్టర్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్

  వంశీ కేవలం డైరెక్టర్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్

  వంశీ అంద‌రికీ డైర‌క్ట‌ర్‌గా మాత్రమే తెలుసు. కానీ త‌ను నాకు ఫ్యామిలీ మెంబ‌ర్ లాంటోడు. ఆ 12 రోజులు వంశీ, సురేందర్, ప్ర‌కాష్ రాజ్‌గారు నన్ను జాగ్రత్తగా చూసుకునే వారు, మోరల్ గా బూస్టప్ ఇచ్చేవారు.... అని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

  స‌క్సెస్ ఉన్న‌ప్పుడు అంద‌రూ పొగుడుతారు, కానీ...

  స‌క్సెస్ ఉన్న‌ప్పుడు అంద‌రూ పొగుడుతారు, కానీ...

  స‌క్సెస్ ఉన్న‌ప్పుడు అంద‌రూ పొగుడుతారు అది కామ‌నే. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ మనల్ని నిలబెడుతుంది. కానీ ఫెయిల్యూర్ ఉన్న‌ప్పుడే మోర‌ల్ స‌పోర్ట్ కావాలి. మున్నా సినిమా పోయినపుడు వంశీ మోరల్ గా ఎంత వీక్ అయ్యాడో నాకు తెలుసు. అలాగే వేణు కూడా. వారిద్దరూ ఇద్దరూ కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా నా పక్కన నిలబడటం చాలా ఆనందంగా ఉంది. స‌క్సెస్ ఉన్న‌వాళ్ల‌తో సినిమాలు చేస్తే అది ఆటోమేటిగ్గా వ‌చ్చేస్తుంది. కానీ డ్రాప్ అయిన వారితో కలిసి విజయం సాధించినపుడే నిజమైన సక్సెస్. లైఫ్ లో నాకు ఇది నేను ఎక్స్ పీరియన్స్ అయ్యాను. ఇది ఆరు సినిమాల‌నే ఈవెంట్‌లాగానే చేద్దామ‌నుక‌న్నా. కానీ ఎమోష‌న‌ల్ డ్రైవ్ అయిపోయింది..... అని దిల్ రాజు తెలిపారు.

  ప్ర‌తి ఒక్క‌రూ బ్ల‌డ్‌, హార్ట్ పెట్టి ప‌నిచేశారు

  ప్ర‌తి ఒక్క‌రూ బ్ల‌డ్‌, హార్ట్ పెట్టి ప‌నిచేశారు

  నాకు ఆ ఇన్సిడెంట్(భార్య మరణం) అయిన తర్వాత నా ద‌గ్గ‌ర‌కు మొదట వచ్చింది రత్నం, శేఖ‌ర్‌గారు. ఫస్ట్ వారికి నేను చెప్పింది ఒకటే. మొదట మీరు మీ వర్క్ చేయండి అన్నాను. వారు యు.ఎస్‌.లో అనుకున్నది అనుకున్నట్లు కంప్లీట్ చేసుకుని వ‌చ్చారు కాబ‌ట్టి ఫిదా ఒక క్లాసిక్ అయింది. తర్వాత చేసిన రాజా ది గ్రేట్ కానీ, ఎంసీఏ కానీ... ఊరికే సక్సెస్ లు రాలేదు. ఈ సినిమాలకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ బ్ల‌డ్‌, హార్ట్ పెట్టి ప‌నిచేశారు... కాబట్టే ఈ సక్సెస్ వచ్చింది అని దిల్ రాజు తెలిపారు.

  డిస్ట్రిబ్యూటర్స్ ను సొంత మనుషుల్లా చూసుకుంటా

  డిస్ట్రిబ్యూటర్స్ ను సొంత మనుషుల్లా చూసుకుంటా

  నేను డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి వచ్చాను కాబట్టే.... నా డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను సొంత మ‌నుషులులాగా చూస్తాను. వాళ్లు సినిమాల‌ను ప్ర‌మోట్ చేసి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు అయ్యేలా చేశారు... అని దిల్ రాజు తెలిపారు.

  గేట్ కీప‌ర్‌లాగా నిలబడతా, వారి రియాక్షన్ తెలుసుకుంటా

  గేట్ కీప‌ర్‌లాగా నిలబడతా, వారి రియాక్షన్ తెలుసుకుంటా

  ఒక సినిమా ఊరికే వ‌చ్చేయ‌దు. సినిమా ఎవ‌రైనా డ‌బుల్ పాజిటివ్‍‌గా చూస్తేంటే నేను గేట్ కీప‌ర్‌లాగా బయట నిలబడాలి. అక్క‌డే నాకు రియాక్ష‌న్ తెలుసుకుంటాను. అపుడే నాకు సినిమా ఫలితం అర్థమవుతుంది. మొదటి రియాక్షన్లోనే తెలుసుకుంటాను. ఒక‌వేళ సినిమా బాగోలేక‌పోతే వాళ్ల రియాక్ష‌న్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ ఆరు సినిమాలు కేవలం మా సక్సెస్ కాదు, ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్ల‌వి, ఆర్టిస్టులవి... అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.... అని దిల్ రాజు తెలిపారు.

  English summary
  Dil Raju Emotional Speech at Sri Venkateshwara Creations Most Successful Year (2017) Celebrations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X