1998 నుంచి నేను కంటున్న కల ఇప్పుడు నిజమైంది.. పవన్ కళ్యాణ్ దేవుడు: దిల్ రాజు ఎమోషనల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో కనిపించడంతో అభిమానుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమా ఈవెంట్ లో చిత్ర నిర్మాత దిల్ రాజు తన మాటలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

తొలిప్రేమ సమయంలోనే అనుకున్నా.

తొలిప్రేమ సమయంలోనే అనుకున్నా.

దిల్ రాజు మాట్లాడుతూ.. 1998 జులై 24 రోజు తొలిప్రేమ విడుదలైన రోజు పవన్ కళ్యాణ్ గారిని మొదటిసారి చూశాను. అది డిస్ట్రిబ్యూటర్ గా నాకు రెండవ సినిమా. అప్పట్లో నేను ఆయనను రెగ్యులర్ గా కలుసుకునేవాన్ని. ఎప్పుడైనా నిర్మాత అయితే సినిమా చేయాలని తొలిప్రేమ సమయంలోనే అనుకున్నా.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ హంగామా... ఆకట్టుకొన్న డ్రమ్మర్ శివమణి

గట్టిగా అనుకో అన్నాడు

గట్టిగా అనుకో అన్నాడు

ఖుషి సినిమా కూడా మేమే డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. సత్యం థియేటర్ కు ఆయన వచ్చినప్పుడు అదే హడావుడి కనిపించింది. అప్పుడు కూడా సినిమాను నిర్మించాలని అనిపించింది. ఆర్య సినిమా మొదలైనప్పుడు కూడా ఆయన స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. అప్పుడు కూడా అనుకున్నాను. ఎన్నో కథలపై చర్చలు జరిపాను. కానీ కుదరలేదు. ఇక గబ్బర్ సింగ్ రిలీజ్ ను కూడా నేనే రిలీజ్ చేశా. ఎప్పుడు అవకాశం వచ్చినా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని హరీష్ తో చెప్పేవాన్ని గట్టిగా అనుకో అన్నా నెరవేరుతుందని చెప్పేవాడు.

 రాజకీయాలకు వెళుతున్నారు అనగానే

రాజకీయాలకు వెళుతున్నారు అనగానే

ఇక ఆయన రాజకీయాలకు వెళుతున్నారు అనగానే మళ్ళీ కుదరదేమో అనుకొని కంగారు పడ్డాను. కానీ నా సంకల్పమే ఆయనతో ఈ రోజు సినిమా చేసే ఛాన్స్ తెచ్చింది. ప్రతి నిర్మాత కూడా ఆయనతో సినిమా చేయాలని అనుకుంటారు. ఇక పింక్ సినిమా వల్లే ఈ రోజు పవర్ స్టార్ తో సినిమా చేయడానికీ కారణమైంది.

 త్రివిక్రమ్ చెప్పడంతో..

త్రివిక్రమ్ చెప్పడంతో..


తమిళ్ లో అజిత్ చేసినప్పుడు నిర్మాత బోణి కపూర్ ట్రైలర్ పంపించారు. అప్పుడే నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నాను. హరీష్ శంకర్ కుడా అదే అన్నాడు. తమిళ్ లో హిట్టవ్వగానే పవన్ కళ్యాణ్ అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యా. కానీ ఆయనను కలవడానికి టైమ్ దొరకలేదు. ఇక త్రివిక్రమ్ తో ఒకసారి ఈ విషయాన్ని చెప్పగా ఆయన ద్వారా కలిసే ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ సంజెస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.

డైరెక్టర్ ఎవరని అనుకుంటున్న సమయంలో

డైరెక్టర్ ఎవరని అనుకుంటున్న సమయంలో


ఈ డ్రీమ్ నెరవేరడానికి తెలియకుండా కారణమైన బోణి కపూర్, అజిత్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ లకు చాలా థాంక్స్. ఇక దర్శకుడు ఎవరని అనుకుంటున్న సమయంలో ముగ్గురి పేర్లను అనుకోని ఆలోచిస్తుండగా డైరెక్టర్ వేణు గుర్తొచ్చాడు. చెప్పగానే అతను నమ్మలేదు. నిజంగా అనడంతో రోజు సీన్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చాడు. అప్పుడు అతనే అని ఫిక్స్ అయ్యాం.

 ఆయన ఒక దేవుడు

ఆయన ఒక దేవుడు

అయితే పింక్ లాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ ను చూపించడం ఒక పెద్ద సవాల్ అయినప్పటికీ అభిమానుల అంచనాలకు తగ్గట్లు ప్రతి పది నిమిషాలకు ఒకసారి వారికి నచ్చే విధంగా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేశాడు. పేపర్లు పట్టుకొని రెడీగా ఉండండి. పింక్ కథను ఏ మాత్రం మార్చకుండా దర్శకుడు వేణు సినిమాను రెడీ చేశాడు. థమన్ అయితే సమయాన్ని లెక్క చేయకుండా ఒక పిచ్చోడిలా వర్క్ చేశాడు. పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చాడు. ఇక ఏప్రిల్ 9న తప్పకుండా కాలర్ ఎగరేసుకోవచ్చు... పవన్ కళ్యాణ్ ఒకరోజు నన్ను పిలిచి చెప్పిన మాటలు నేను ఎప్పటికి మరచిపోలేను. ఆయన ఒక దేవుడు.. అని దిల్ రాజు ఎమోషనల్ గా మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X