»   » బాహుబలి బ్లాక్ టికెట్స్: నిర్మాత దిల్ రాజుపై ఆరోపణలు

బాహుబలి బ్లాక్ టికెట్స్: నిర్మాత దిల్ రాజుపై ఆరోపణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' టికెట్స్ బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణలతో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై కేసు నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పలు కొన్ని టీవీ ఛానల్స్ లో వార్తలొచ్చాయి. టికెట్లు అడ్డదారిలో అధిక రేట్లకు అమ్ముతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ పోలీసులను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.

అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని బెనిఫిట్ షోలు, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో భారీ ధరలకు టికెట్లు అమ్ముతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెనిఫిట్ షోల రూపంలో దిల్ రాజు రూ. 1 కోటి రాబట్టుకునే ప్లాన్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. బెనిఫిట్ షోల రేట్ల వేలల్లో అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Dil Raju faced trouble with Black Tickets

బాహుబలి బ్లాక్ టికెటింగ్ ఆరోపణలు రావడంతో చాలా చోట్ల అధికారులు రంగంలోకి దిగారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న కొందరు వ్యక్తులతో పాటు ఓ థియేటర్ మేనేజర్ ను కూడా పోలీసులు అరెస్టు చేసారు.

కొన్ని జిల్లాలో బాహుబలి బ్లాక్ మార్కెటింగుపై జాయింట్ కలెక్టర్లు రంగంలోకి దిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 10న దాదాపు 4000 థియేటర్లలో విడుదలవుతోంది.

English summary
Director Rajamouli's whose highly anticipated magnum opus movie Baahubali is all set to release on July 10th. Dil Raju faced trouble with Black Tickets.
Please Wait while comments are loading...