యాక్సిడెంట్‌లో గాయపడ్డ దిల్ రాజు పేరెంట్స్
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తల్లిదండ్రులు యాక్సిడెంట్‌కు గురై గాయపడ్డారు. వారు హైదరాబాద్ నుంచి స్వస్థలం నిజామాబాద్ వెలుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, తల్లి ప్రమీలమ్మకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు.
దిల్ రాజు సినిమాల వివరాల్లోకి వెళితే...
ప్రస్తుతం ఆయన మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఎవడు', జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరో వైపు డిస్ట్రిబ్యూటర్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. దిల్ రాజు ఇటీవల డిస్ట్రిబ్యూట్ చేసిన రచ్చ, గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు భారీ విజయం సాధించాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం డిసెంబర్ 21న విడుదలువుతోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న 'ఎవడు'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాణం అవుతున్న ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్-హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











