Dil Raju తీవ్ర విషాదంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఏం జరిగిందంటే?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దిల్ రాజు తండ్రి అక్టోబర్ 9వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మరణించారు అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దిల్ రాజు తండ్రి మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తండ్రి మరణంతో దిల్ రాజు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తండ్రి మృతితో పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆయనను పలువురు ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పరామర్శిస్తున్నారు. కొందరు ప్రముఖులు ఫోన్‌లో, మరికొందరు స్వయంగా వెళ్లి దిల్ రాజును ఓదార్చుతున్నారు.
ఇదిలా ఉండగా, శ్యాంసుందర్ రెడ్డి భౌతికకాయాన్ని ఉదయం ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలోని దిల్ రాజు నివాసానికి తీసుకొస్తారు. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











