రెడీ, మస్కా వంటి సినిమాలతో దూసుకుపోతున్న రామ్ తాజాగా మరో సినిమా కమిటయ్యారు. అతను హీరో గా 'లక్ష్యం' దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఒక చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత 'దిల్' రాజు సన్నాహాలు చేస్తున్నారు. 'దిల్' రాజు ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం తర్వాత ఈ సినిమా ఉంటుంది. అలాగే ఈ చిత్రం కోసం ఒక కథ సిద్ధమైందని, అది రామ్‌కు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్. ప్రస్తుతం దిల్ రాజు తమిళంలో ప్రకాష్ రాజ్ రూపొందించిన చిత్రాన్ని ఆకాశమంత పేరుతో డబ్బింగ్ చేస్తూ..నేటివిటీ కోసం కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారు.