twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గగనం' చిత్ర కథ కాపీ వివాదంపై దిల్ రాజు ఘాటు స్పందన

    By Srikanya
    |

    నాగార్జున హీరోగా శుక్రవారం విడుదలైన గగనం చిత్ర కథ తను రాసినదేనని రచయిత్రి ముచ్చర్ల రజనీశకుంతల మీడియాకెక్కిన సంగతి తెలిసిందే. అలాగే కథంతా అలాగే తీసి కేవలం తను రాసుకున్న క్లైమాక్స్‌ను కొద్దిగా మార్చి దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు మండిపడ్డారు. పబ్లిసిటీకోసం మీడియాకెక్కవద్దని అన్నారు. కథ మీదేనని అనిపించినప్పుడు తనను సంప్రదించాలి కానీ...ఇలా మీడియాకెక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసలు ఆ కథ ముచ్చర్లదని ఆమె చెపుతున్నా, తను విశ్వసించలేనని అన్నారు. అయితే దీనికి శకుంతల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తను రాసిన కథను ఆసాంతం చదివిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని దిల్ రాజుకు సూచించారు. అయితే గగనం కాపీ కథ అని నిరూపణ అయితే తాను దేనికైనా సిద్ధమేనని ఆయన అన్నారు.కాందహార్ హైజాక్ ఉదంతాన్ని ప్రేరణగా తీసుకుని తాను హైజాక్ పేర నవల రాశానని, 2000లో అది మయూరి పత్రికలో సీరియల్‌గా వచ్చిందని ఆమె చెప్పారు.

    English summary
    Nag's Gaganam film was released and running successfully. Lady writer Rajini Shankuntala is claiming that the director violated the copy right act and copied her Novel named 'Hijack 2000'.She says that her Novel was published as serial in one of the leading Telugu weekly. She came before media to say that Novel was the same story that of Gaganam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X