హీరోయిన్‌తో ఎఫైర్....దిల్ రాజు ఫైర్!

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి, ‘పరుగు' హీరోయిన్ షీలా గురించి ఓ వార్త గత కొన్ని రోజులుగా చర్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనేది సదరు పుకార్ల సారాంశం. ఇటీవలే ఈ వార్తలపై షీలా స్పందించింది. దిల్ రాజుతో ఎఫైర్ వార్తలను ఖండించారు.

తాజాగా దిల్ రాజు కూడా ఈ ఎఫైర్ వార్తలపై ఫైర్ అయ్యారు. ఖండించారు. ఇలాంటి ఆధారం లేని రూమర్లపై తాను స్పందించబోనని తేల్చి చెప్పారు. అయితే చాలా కాలంగా షీ గురించి ఈ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చాలా ఆలస్యంగా వీరిద్దరూ ఈ వార్తలను ఖండించడం చర్చనీయాంశం అయింది.

 Dil Raju fires on media

షీలా మాట్లాడుతూ...తాను టాలీవుడ్ లో ఎవరితోనూ టచ్‌లో లేనని అంది. దిల్ రాజు ని చివరగా అదుర్స్ ఆడియో ఫంక్షన్ లోనే చూసానని అన్నారు. అసలు నా దగ్గర దిల్ రాజు నెంబర్ కూడా లేదని అన్నారామె. నేను గత సంవత్సర కాలంగా యు.కె లో ఉంటున్నాను. తెలుగు పరిశ్రమలో నాకు ప్రత్యేకంగా స్నేహితులంటూ ఎవరూ లేరు అని తెలిపారు.

నేను ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినా పని అయిన వెంటనే చెన్నై వెళ్లిపోయేదాన్ని. నేను అందరితో కలిసేదాన్ని కాదు. ఇక పరుగు చిత్రంలో దిల్ రాజు రికమండేషన్ తోనే ప్రాజెక్టులోకి వచ్చానన్న విషయాన్ని ఆమె కొట్టిపారేసారు. అలాటిదేమీలేదు. మొదట అల్లు అరవింద్ గారే నన్ను చూసి, ఫొటో షూట్‌కి పిలిచారు అని చెప్పారామె.

పరమవీరచక్ర చిత్రం తర్వాత షీలా తెలుగు తెరపై కనిపించలేదు. మళ్లీ తిరిగి ఎప్పుడు తెలుగు రానున్నారు అనే విషయం మాట్లాడుతూ... " ఇంప్రెస్ చేసే స్క్రిప్టుతో ఎవరైనా వస్తే తప్పుకుండా తిరిగి వస్తాను..అదే సమయంలో ఎన్ని రోజులు షూటింగ్ డేస్ ఉంటాయనేది కూడా నాకు ముఖ్యమే..ఆ రెండు చూసుకునే నేను డెశిషన్ తీసుకుంటాను" అంది షీలా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X