twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్స్ బంద్ పై పిచ్చి రాతలు ఆపండి.. ఆ నాలుగు కారణాలతోనే షూటింగ్ బంద్.. పెదవి విప్పిన దిల్ రాజు!

    |

    షూటింగ్స్ బంద్ విషయంపై నిర్మాతల మండలితో కలిసి దిల్ రాజు అఫీషియల్ ప్రకటన చేశారు. చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్సే సుప్రీమ్ అని, తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్ అని పేర్కొన్నారు. అలాగే మాలో మాకు ఎలాంటి గొడవలు లేవని కూడా అయన అన్నారు. ఇక ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏమి మాట్లాడారు అనే వివరాల్లోకి వెళితే..

    త్వరలోనే

    త్వరలోనే

    ఇక నుంచి అప్డేట్ అయినా ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారానే వస్తుందన్నా దిల్ రాజు ప్రస్తుతం అన్ని సినిమాల చిత్రీకరణలు ఆగాయని, త్వరలోనే సమస్యలను పరిష్కరించి , షూటింగ్ లు మొదలు పెడతామని అన్నారు. తెలుగు సినిమా నిర్మాతలగా మేము షూటింగ్స్ ను అపామని, ముఖ్యంగా మేము 4పాయింట్స్ పై చర్చిస్తున్నామని అన్నారు. అసలు ముందుగా ఓటిటికి ఎన్ని వారాలకు వెళితే ఇండస్ట్రీ కి మంచిది అని ఈ విషయంలో ఒక కమిటీ వేసుకున్నామని, ఆ కమిటీ ఓటిటికి సంబంధించి వర్క్ చేస్తుందని అన్నారు.

     ఏవేవో రాస్తున్నారని

    ఏవేవో రాస్తున్నారని


    రెండవది... థియేటర్స్ లో వి పి ఎఫ్ ఛార్జీలు పర్సెంటెంజ్ లు ఎలా వుండాలి అనేదానిపై ఒక కమిటీ వేసామని, ఆ కమిటీ ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతుందని అన్నారు. ఇక మూడవది.... ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్ పై కూడా కమిటీ వేశామని, అలాగే నాలుగు. నిర్మాతలకు ప్రొడక్షన్ లో వెస్తేజ్, వర్కింగ్ కండిషన్స్, షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలి అంటే ఏమి చెయ్యాలి దీనికి కూడా కమిటీ వేసామని అన్నారు. ఈ నాలుగు పాయింట్స్ మీద ఛాంబర్ అధ్వర్యంలో కమిటీలు వెసాము అవి వర్క్ చేస్తున్నాయని కానీ సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారని ఆయన అన్నారు.

    Recommended Video

    బాక్స్ ఆఫీస్ యుద్ధం లో బింబిసారుడు గెలిచాడా లేదా *Reviews | Telugu OneIndia
    ఆ రిజల్ట్ త్వరలో

    ఆ రిజల్ట్ త్వరలో


    ఇక మా అందరికీ ఫిలిం ఛాంబర్ ఫైనల్ అని, మేము నెలలు తరబడి షూటింగ్స్ ఆపాలని ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. నిర్మాతకు భారం కాకూడదన్నా ఆయన లాస్ట్ మూడు రోజులనుంచి మూడు నాలుగు మీటింగ్స్ అయ్యాయని, ఈ నాలుగు కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయని కూడా అన్నారు. తెలుగు సినిమా ఎలా వుండాలి అనేది వర్క్ చేస్తున్నాము త్వరలో ఆ రిజల్ట్ వస్తుందని పేర్కొన్నారు.

     ఓపికపడితే

    ఓపికపడితే


    ఇక నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ నిర్మాతల కష్టాలను పరిష్కరించుకునేందుకు నిరవధికంగా షూటింగ్స్ బంద్ చేశామని, సమస్యలు పరిష్కారం అయితే నిర్మాతలకు చాలా ఉపశమనం కలుగుతుందని అన్నారు. మన కళ్లు మనం పొడుచుకోవద్దని, వారం పది రోజులు ఓపికపడితే సమస్యలన్ని పరిష్కారం అవుతాయని అన్నారు.

     సరికాదని

    సరికాదని


    కమిటీలు వేసుకొని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామని, నిర్మాతలెవరూ బయట ప్రచారమయ్యే పుకార్లను నమ్మొద్దని ఆయన అన్నారు. నిర్మాతలందరం కలిసికట్టుగా ఉన్నామని, నిర్మాతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని కూడా పేర్కొన్నారు. నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏదైనా అందరి లక్ష్యం ఒక్కటే అని అన్నారు. సినీ పరిశ్రమకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఒక్కటే పేరంట్ బాడీ అని, దిల్ రాజు గారు ఆయన సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చిస్తున్నారు కానీ దిల్ రాజును కార్నర్ చేసి మాట్లాడటం సరికాదని అన్నారు. అందరం పనులను జరగాలని కష్టపడుతున్నామని ఆయన ఈ సంధర్భంగా పేర్కొన్నారు.

    English summary
    Dil Raju along with film chamber Gave Clarity about shootings bundh in tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X