ఆ సినిమాతో 'దిల్ రాజు'కి నాగిరెడ్డి పురస్కారం

By Srikanya

విజయ సంస్థలో ఒకరైన నాగిరెడ్డి శతజయంతి సంవత్సరమిది. ఈ సందర్భంగా విజయ మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నాగిరెడ్డి పేరిట ప్రతియేటా ఓ పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ యేడాది ఆ పురస్కారానికి 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం ఎంపికైంది.ఈ నెల 22న జరిగే ఓ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజుకు ఈ పురస్కారం కింద రూ.1.5 లక్షలు నగదు బహుమతితోపాటు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ విషయాన్ని నాగిరెడ్డి తనయుడు బి.వెంకట్రామిరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ''మా నాన్నగారి ఆలోచనలకు అనుగుణంగా ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశాం. సందేశం, వినోదం, వాణిజ్యాంశాల మేళవింపుతో ఇంటిల్లిపాదినీ అలరించిన ఓ చిత్రాన్ని ఎంపిక చేసి ఆ నిర్మాతకు నాగిరెడ్డి పురస్కారం అందిస్తాం. ఈ యేడాది 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం ఎంపికైంది. ఈ నెల 22న జరిగే ఓ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజుకు ఈ పురస్కారం కింద రూ.1.5 లక్షలు నగదు బహుమతితోపాటు, జ్ఞాపికను అందజేస్తాం. యేటా జరిగే ఈ అవార్డుల ఎంపికకు సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశాం. తెలుగుతోపాటు, తమిళంలోనూ ఓ చిత్రానికి ఈ పురస్కారం అందిస్తాం. ప్రస్తుతం తమిళ చిత్రం ఎంపిక జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, సి.నారాయణరెడ్డి, నందమూరి బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌ తదితరులు హాజరవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X