హాట్ టాపిక్: బన్నీని ఒప్పించాడు.. దిల్ రాజు వద్ద ఖరీదైన గిఫ్ట్ పట్టేశాడు!
Recommended Video

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు వరుస విజయాలు అందుకుంటూ దూసుకెళుతున్నారు. అందుకు కారణం కేవలం కథల విషయంలో అతడి డెసిషన్ మేకింగ్ మాత్రమే కాదు. విజయాలు తెచ్చిపెట్టే అద్భుతమైన కథలు రాసే రైటర్లు, డైరెక్టర్లు అతడి ఆస్థానంలో కొలువుతీరడమే.
టాలెంట్ ఉన్న రచయితలను, దర్శకులను ప్రోత్సహించడంలో ముందుండే దిల్ రాజు... రెమ్యూనరేషన్ విషయంలో అయినా, వారికి ప్రోత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో అయినా రెండు అడుగులు ముందే ఉంటారు. దిల్ రాజు బేనర్లో ఒక హిట్టు పడిందంటే.. ఆ సినిమాకు పని చేసిన వారి పంటపండినట్లే.

వేణు శ్రీరామ్‌కు కారు గిఫ్టుగా ఇచ్చిన దిల్ రాజు
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ‘ఎంసీఏ' ఫేం వేణు శ్రీరామ్‌కు దిల్ రాజు ఖరీదైన హ్యుందాయ్ కారు గిఫ్టుగా అందించినట్లు తెలుస్తోంది. ఎంసీఏ తర్వాత వేణు నుంచి ఎలాంటి సినిమా రాలేదు... ఇప్పుడు ఈ గిఫ్ట్ ఏమిటా? అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ బహుమతి వెనక ఒక స్పెషల్ రీజన్ ఉందని టాక్.

బన్నీని ఒప్పించిన వేణు శ్రీరామ్
‘ఎంసీఏ' విజయం తర్వాత దిల్ రాజు బేనర్లోనే మరో సినిమా చేయడానికి కమిటైన వేణు... ఎవరైనా పెద్ద స్టార్ డేట్స్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వేణు తన కథతో బన్నీని ఒప్పించాడని, దిల్ రాజు బేనర్లో ఈ సినిమా చేయడానికి బన్నీ అంగీకరించారని... ఈ సందర్బంగానే అతడికి కారు గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

సినిమా మొదలు అయ్యేది ఎప్పుడు?
అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ సినిమాలో చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత వేణు శ్రీరామ్ ప్రాజెక్టు ప్లోర్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఏడాది సెకండాఫ్‌లో ఫార్మల్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్-దిల్ రాజు
అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు ఇప్పటికే పలు సినిమాలు నిర్మించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య' సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పరుగు, దువ్వాడ జగన్నాథం చిత్రాలు రాగా... తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది.

భారీ ప్రాజెక్టుగా...
బన్నీ సినిమా అంటే బడ్జెట్ భారీగానే ఉంటుంది, అందులోనూ దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ రంగంలో ఉంటే... సినిమా లెవల్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











