హాట్ హాట్‌గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు క్లారిటీ!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతున్నది. నిర్మాతలు దిల్ రాజు ప్యానెల్, సీ కల్యాణ్ ప్యానెల్ తమ వాదనలు వినిపిస్తున్నారు. దాదాపు 1560 మంది ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోనున్నారు. ఆదివారం జూలై 30వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
టాలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక వ్యక్తికి 18 ఓట్లు ఉన్నాయి. ఒకే వ్యక్తి పలు బ్యానర్లు స్థాపించి ఒక్కో బ్యానర్‌కు ఒక్కో ఓటు వేసే ఆనవాయితీ ఉంది. అలాంటి సంస్కృతిని అడ్డుకోవాలి. నా బ్యానర్‌పై నాకు ఒకే ఓటు ఉంది. అయితే ఒకే వ్యక్తికి ఒకే ఉండాలనేది నా అభిప్రాయం. మా ప్యానెల్ గెలుస్తే.. ఒకే ఓటు ఉండేలా చర్యలు తీసుకొంటామా అనే ఎన్నికల ముందు ఆ సమాధానం చెప్పలేం. ఎన్నికలు, వేరు రాజకీయాలు వేరు అని దిల్ రాజు అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను పోటీ చేయవద్దని అనుకొన్నాను. కానీ నిర్మాతలందరూ పట్టు బట్టి నన్ను నిలబెట్టారు. బిజీగా ఉండే తాను అందరికి అందుబాటులో ఉండాలి. నేను ఉండే బిజీగా ఉంటూ అధ్యక్షుడిగా మరింత సమయాన్ని కేటాయించాలి. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు అందుబాటులో ఉండాలి అని దిల్ రాజు చెప్పారు.
మా ప్యానెల్ గెలిస్తే ఇండస్ట్రీ ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తాం. మా ప్రత్యర్థి (సీ కల్యాణ్) ప్యానెల్‌లో సినిమాలు తీయని వారే ఎక్కువగా ఉన్నారు. మా ప్యానెల్‌లో యాక్టివ్‌గా ఉన్న నిర్మాతలే ఎక్కువ మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగోగులు చూసే వారు.. యాక్టివ్ నిర్మాతలే అని అన్నారు.
చిన్న నిర్మాతలు ఎదుర్కొనే సమస్యలను, అలాగే డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారితో పోల్చుకొంటే నిర్మాతలకు ఎక్కువ సమస్యలు ఉంటాయి. సినిమా పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవకాశం ఉంది అని దిల్ రాజు చెప్పారు.
తెలంగాణలో తాను రాజకీయాల్లోకి వస్తున్నాననే విషయంపై నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆ ఊహాగానాలు మీడియాలో కొనసాగుతున్నాయి. నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని నేను అధికారికంగా చెప్పలేదు అని దిల్ రాజు స్పష్టం చేశారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో నేపథ్యంలో నేను ఒకటే చెబుతాను.. నేను రాజకీయాల్లోకి వెళితే.. ఏదో ఒక పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో.. ఎన్నికల్లో గెలువొచ్చు.. గెలవకపోవచ్చు. కానీ రాజకీయాలు కావాలా? సినిమాలు కావాలా? అంటే నేను సినిమాకే నేను ఓటు వేస్తాను అని దిల్ రాజు చెప్పారు.


Click it and Unblock the Notifications











