»   » 100 కష్టమే... 50 గ్యారంటీ, దాన్ని ముట్టుకోను: తేల్చి చెప్పిన దిల్ రాజు

100 కష్టమే... 50 గ్యారంటీ, దాన్ని ముట్టుకోను: తేల్చి చెప్పిన దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'డిజె' చిత్ర ట్రైలర్‌కు భారీ స్పందన రావడంపై చిత్ర నిర్మాత దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. తమ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌కు, స్టైలిష్ స్టార్ బన్నీకి 'దువ్వాడ జగన్నాధమ్' హ్యాట్రిక్ మూవీ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

డిజె చిత్రాన్ని జూన్ 23న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని, బన్నీ కెరీర్లోనే ఒక మంచి హిట్ సినిమాగా ఈ చిత్రం నిలుస్తుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


డిజే ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 7.4 మిలియన్ వ్యూస్ సాధించడంతో పాటు 46 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ సాధించి వ్యూస్ పరంగా సౌతిండియా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.


మరో సినిమాకు సిద్ధం

మరో సినిమాకు సిద్ధం

దర్శకుడు హరీష్ శంకర్‌తో తాను మరో సినిమాను నిర్మించబోతున్నట్లు దిల్ రాజు తెలిపారు. డిజే మూవీ రిలీజ్ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు.


100 కష్టమే... 50 గ్యారంటీ

100 కష్టమే... 50 గ్యారంటీ

దర్శకుల సపోర్టు ఉంటే నిర్మాతగా తాను కచ్చితంగా యాభై సినిమాలు నిర్మిస్తానని అయితే కెరీర్లో వంద చిత్రాలను నిర్మిస్తానో, లేదో ఇప్పుడే చెప్పలేనని... వంద సినిమాలు నిర్మించడం అంటే కష్టమే అన్నారు.


దాన్ని ముట్టుకోను

దాన్ని ముట్టుకోను

తన జీవితంలో ఎప్పటికీ మెగా ఫోన్ ముట్టుకోనని, దర్శకత్వం జోలికి అస్సలు వెళ్లబోనని దిల్ రాజు తెలిపారు. దర్శకత్వం అంటే ఎంత కష్టమో తనకు తకు తెలుసని, సినిమాను తెరకెక్కించే క్రమంలో రాత్రింబవళ్లు వారు పడే కష్టం తనకు భయాన్ని కలిగిస్తుందని, అందుకే తాను దర్శకత్వం వైపు అస్సలు వెళ్లనని తెలిపారు.


దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాల కోసం క్లిక్ చేయండి.English summary
Dil Raju said that "I don't want to direct a film. I'll never do it. There is a reason for it. Usually I express my opinion about the story.. whether it is good or bad. I will tell them if there are any flaws in the story. When I watch directors.. their passion and hardwork to make a movie successful, I decided not to direct a film".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu