టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలుపై దిల్ రాజు క్లారిటీ.. ఏమన్నారంటే?

Dil Raju: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీఅనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, ప్రొడ్యూసర్ దిల్‌ రాజు (Dil Raju) మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ అభివృద్ధే ఈ మీటింగ్‌ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి తమకు కొన్ని విషయాల్లో దిశా నిర్దేశం చేశారని చెప్పారు. హైదరాబాదులో తెలుగు సినిమాలో కాకుండా ఇంటర్నేషనల్, హాలీవుడ్ సినిమాలు షూటింగ్ చేసేలా చర్యలు తీసుకోవడానికి సలహాలు ఇవ్వమని ప్రభుత్వం కోరినట్టు తెలిపారు. ఈ విషయంపై తాను ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి, ఎలాంటి విషయాలను సూచించాలనేది త్వరలో ఎఫ్‌డీసీ ద్వారా వెల్లడిస్తానని పేర్కొన్నారు దిల్ రాజు.

సినిమాలకు హైదరాబాదును ఇంటర్నేషనల్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు టాలీవుడ్ నుండి కూడా సహకారం కావాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా ప్రోత్సాహం అందించాలంటూ ప్రభుత్వం ప్రతిపాదనను తమపై ఉంచిందని, అందుకు తాము ఎప్పుడు కూడా ముందుంటామని పేర్కొన్నారు. మొత్తంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వము టాలీవుడ్ కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకురాబోతున్నామంటూ పేర్కొన్నారు.

Dil Raju gives clarity on ticket rates benefit shows After Meeting With CM Revanth Reddy

ఇటీవల అనుకోకుండా జరిగిన కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీ కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీపై కక్ష కట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. అదంతా కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. త్వరలోనే మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అవుతామని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుంటుందనే హామీ ఇచ్చిందని దిల్ రాజు పేర్కొన్నారు. ఈ భేటీలో తాము కూడా తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

అలాగే.. సినిమా షూటింగ్స్, ఈవెంట్స్ కోసం పర్మిషన్స్ చిన్న సినిమాలకు రాయితీల విషయంపై ప్రధానంగా చర్చించామంటూ పేర్కొన్నారు. సినిమాలు, ఈవెంట్స్ పర్మిషన్ కోసం ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లాలనేది మా స్పెషల్ డ్రైవ్ అంటూ దిల్ రాజు పేర్కొన్నారు.

బెనిఫిట్ షోలు , టికెట్ రేట్ల పెంపు ఉంటుందా అని ప్రశ్నించగా.. టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు అనేది చిన్న అంశం. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైట్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలు ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది గవర్నమెంట్ విజన్. అదే ప్రభుత్వ అజెండా. సినిమా సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్ లో ఉంచడానికి ఏం చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, హైదరాబాదును ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా ఎలా క్రియేట్ చేయాలి అనే అంశాలు పై తమ చర్చించామని, ఇదే పెద్ద అంశం అని దిల్ రాజ్ పేర్కొన్నారు. బెనిఫిట్ షో లు టికెట్ల పెంపు అనేది.. సమయమే నిర్ణయిస్తుందనీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దిల్ రాజు.

More from Filmibeat

Read more about: revanth reddy dil raju tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X