Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
దిల్ రాజు చేతికి 'గణేష్'
'రెడీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత స్రవంతి బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం 'గణేష్" కావడం, 'మగధీర' వంటి సంచలన హిట్ తర్వాత కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే 4.5 కోట్ల రూపాయల భారీ ఆఫర్ తో నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న దిల్ రాజు ఇటీవలే విక్రమ్ 'మల్లన్న' చిత్రం నైజాం ఏరియా రైట్స్ ను దక్కించుకున్న విషయం మన తెలిసిందే . తాజాగా రామ్ కథానాయకుడుగా స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్న గణేష్ (జస్ట్ గణేష్) చిత్రం నైజాం ఏరియా రైట్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు. గుంటూరు, కృష్ణా ఏరియాల్లో స్రవంతి రవికిషోర్ సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ రైట్స్ ను క్యాడ్ ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది.
దర్శకుడు డి.శరవణన్ పిల్లల నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా 'గణేష్'ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రంలోని క్లైమాక్స్ లో వచ్చే 'లంబోదర అంబాసుత' అనే పాటను సారథి స్టూడియోస్ లో రిచ్ గా చిత్రీకరించారు. 'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన మిక్కీ జె. మేయర్ సంగీతం, 'మగధీర' చిత్రాన్ని యాక్షన్ ఘట్టాలు అందించిన పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 23 లేదా 24న ఈ చిత్రం విడుదల కానుంది.