మనవడి దోతి ఫంక్షన్ లో దిల్ రాజు చిందులు.. భుజాలపై ఎత్తుకొని..
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎలాంటి సినిమా నిర్మించినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లు అందుకునేలా ఉంటాయి. ఆయన ప్రస్తుతం వరుసగా టాప్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా దిల్ రాజు ఇంట్లో వేడుకలు ఉంటే మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టేస్తారు. ఇక ఇటీవల మనవడి దోతి ఫంక్షన్ వేడుకను కూడా ఆయన ఫుల్ జోష్ లో నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

మనవడు వచ్చాక మరింత జోష్ తో
దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించిన విషయం తెలిసిందే. ఇక వారికి ఉన్న ఏకైక కుమార్తె హన్షిత రెడ్డి అంటే దిల్ రాజు ప్రాణం. కూతురి పెళ్లిని కూడా ఎంత గ్రాండ్ గా చేశారు. ఇక పిల్లలంటే ఎంతగానో ఇష్టపడే దిల్ రాజు మనవడు పుట్టాక మరింత జోష్ తో కనిపిస్తున్నారనే చెప్పాలి. మనవడితోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.

ఆరాన్ష్ ను భుజాలపై ఎత్తుకొని
ఇక ఇటీవల మనవడి దొతి ఫంక్షన్ ను దిల్ రాజు ఇంట్లోనే నిర్వహించారు. దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలో దిల్ రాజు కాస్త యంగ్ గానే కనిపిస్తున్నారు. మనవడు ఆరాన్ష్ ను భుజాలపై ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేశారు.

చిందులు వేస్తూ
తెల్లని కుర్తా పైజమా ధరించి 'దిల్' రాజు వేడుకలో మనవడికి సాంప్రదాయం ప్రకారం స్నానం కూడా చేయించారు. దిల్ రాజు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన అల్లుడికి సంబంధించిన తల్లిదండ్రులు అలాగే మరికొందరు సన్నిహితులు కూడా ఈ మినీ వేడుకలో చిందులు వేస్తూ కనిపించారు.
Recommended Video

మరింత కలర్ఫుల్ గా
ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత మరణం అనంతరం ఆయన కూతురు హన్షిత ఆలోచించిన విధానం చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. తండ్రి ఒంటరిగా ఉండకూడదని పెళ్లికి ఒప్పించింది.
దీంతో దిల్ రాజు లాక్ డౌన్ లో వైషు రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ వివాహం అనంతరం దిల్ రాజు లైఫ్ మరింత కలర్ఫుల్ గా మారింది. వివాహం చేసుకున్న చాలా రోజులకు తన ఇంట్లోనే స్టార్ హీరోలను పిలిచి పార్టీ కూడా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











