ఎమ్మెల్యేతో వియ్యం: నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. దిల్ రాజు సోదరుడి కుమారుడు, యంగ్ ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ ఏడాది వచ్చిన రాజ్ తరుణ్ మూవీ 'లవర్' ద్వారా హర్షిత్ రెడ్డి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.
దిల్ రాజ్ వారసత్వంతో వారి కుటుంబం నుంచి వచ్చిన తొలి యువ నిర్మాత హర్షిత్ రెడ్డి. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో పాటు మనికొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ హర్షిత్ రెడ్డి సినీ నిర్మాణంలో మెళకువలు నేర్చకుంటున్నాడు.

ఎమ్మెల్యేతో వియ్యం
హర్షిత్ రెడ్డి ఎంగేట్మెంట్ కొన్ని రోజుల క్రితం గౌతమితో జరిగింది. గౌతమి మరెవరో కాదు... ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె.

గోవా వెడ్డింగ్
టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హర్షిత్ రెడ్డి, గౌతమి వివాహం గోవాలో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21న ముహూర్తం నిర్ణయించారని, ఈ పెళ్లి వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొంటారని టాక్.

వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేసిన దిల్ రాజు
పెళ్లి వేడుక అనంరతం డిసెంబర్ 23న నిర్మాత దిల్ రాజు శంషాబాద్ లోని ఓం కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేబోతున్నారు. ఈ వేడుకకు పొలిటీషియన్స్, తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు హాజరు కానున్నారు.

దిల్ రాజు మూవీస్
దిల్ రాజు బేనర్ నుంచి వస్తున్న సినిమాల విషయానికొస్తే.... వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 2' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతోంది. దీంతో పాటు మహేష్ బాబు మూవీ ‘మహర్షి'లో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











