»   » నేను స్టార్స్ వెంట పడుతున్న మాట నిజమే...!(దిల్ రాజు ఇంటర్వ్యూ)

నేను స్టార్స్ వెంట పడుతున్న మాట నిజమే...!(దిల్ రాజు ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే ఆ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది, కథలో బలం ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. దిల్ రాజులో ఇపుడు చాలా మార్పు వచ్చింది.

ఇపుడు దిల్ రాజు కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోల డేట్స్ కోసం ఆరాట పడుతున్నారు. తన తాజా సినిమా 'సుప్రీమ్' చిత్రం సక్సెస్ మీట్లో పాల్గొన్న దిల్ రాజుకు మీడియా ప్రతినిధుల నుండి ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి.

దీనికి దిల్ రాజు సమాధానం ఇస్తూ....గతంతో పోలిస్తే తన ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిన మాట నిజమే అని ఒప్పుకున్నారు. కెరీర్ ప్రారంభంలో కథ, సినిమాను ఎలా చూడాలి? బడ్జెట్ ఎంత వుండాలి అనే విషయాల్ని పెద్దగా పట్టించుకోలేదు. నచ్చిన కథలతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగాను. అందుకే ఆ సక్సెస్‌లను బాగా ఎంజాయ్ చేశాను. వాటి వల్లే నిర్మాతగా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. కానీ రానురాను నాలో తెలియకుండానే మార్పులు వచ్చాయన్నారు.

గతంతో పోలిస్తే కథల్ని ఎంచుకునే తీరు మారింది. స్టార్స్‌తో సినిమాలు చేయడం మొదలుపెట్టాను. కథను డామినేట్ చేస్తూ ఓపెనింగ్స్, వసూళ్లు లాంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలైంది అన్నారు దిల్ రాజు.

స్లైడ్ షోలో దిల్ రాజు చెప్పిన మరిన్ని అంశాలు..

మంచి ఫలితాలు వస్తుండటం వల్లే

మంచి ఫలితాలు వస్తుండటం వల్లే

స్టార్స్‌తో చేసిన సినిమాలు సరైన ఫలితాల్ని అందివ్వడంతో ఏ దారిలో వెళ్ల్లడం కరెక్ట్ అనే విషయంలో నాలో అంతర్మథనం మొదలైందని దిల్ రాజు తెలిపారు.

ఆరెండే ప్లాపులు

ఆరెండే ప్లాపులు

సినిమాల ఎంపిక విషయంలో నా ధోరణి మారిన తర్వాత రామయ్య వస్తావయ్యా, కృష్ణాష్టమి మాత్రమే ప్లాపయ్యాయి.నేను చేసిన ప్రతి సినిమా విజయవంతమైంది అన్నారు.

నా సినిమా కథల్లో కొత్తదనం లోపించింది

నా సినిమా కథల్లో కొత్తదనం లోపించింది

ఈ క్రమంలో నేను ఎంపిక చేసుకుంటున్న సినిమాల్లో కథల్లో కొత్తదనం మాత్రం లోపించింది. ఆ లోటు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడమే ఈ మార్పులకు కారణమనుకుంటున్నాను అని దిల్ రాజు తెలిపారు.

నా బ్రాండ్ సినిమాలు వస్తాయి

నా బ్రాండ్ సినిమాలు వస్తాయి

ఇప్పటి వరకు అన్ని బాధ్యతలు నేనే చూసుకోవడం వల్ల ఇలా జరిగింది. అందుకే బాధ్యతల్ని నాతో పాటు శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌లకు అప్పగించాలని నిర్ణయించాను. నా బ్రాండ్ తరహా కుటుంబ కథాంశంతో తప్పకుండా సినిమాలు చేస్తాను అన్నారు దిల్ రాజు.

పూర్తి బాధ్యత నాదే

పూర్తి బాధ్యత నాదే

అప్పడప్పుడు నా అంచనాలు తప్పుతుంటాయనడానికి కృష్ణాష్టమి చిత్రాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. జయాపజయాల్ని నేను సమంగా స్వీకరిస్తాను. దర్శకుడు, హీరో వల్లే ఈ సినిమా పరాజయం పాలైందని చెప్పడం నాకు ఇష్టంలేదు. కథను, దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. కానీ సరైన ఫలితాన్ని అందివ్వలేదు కాబట్టి ఈ విషయంలో నేనే తప్పు చేశానని భావిస్తున్నాన అన్నారు.

సుప్రీమ్ లో కథ లేదు

సుప్రీమ్ లో కథ లేదు

నిజం చెప్పాలంటే సుప్రీమ్‌లో కథ లేదు. చిన్న పాయింట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడించి ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు థియేటర్‌లో కూర్చోబెట్టాలని అనుకున్నాం. ఆ ప్రయత్నంలో విజయవంతమయ్యాం అన్నారు దిల్ రాజు.

సుప్రీమ్ ఫలితంపై

సుప్రీమ్ ఫలితంపై

సెప్రీమ్ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. సినిమా విడుదల రోజు హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్ మెట్ల మీద కూర్చోని ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్న తీరును పరిశీలించాను. వారి స్పందన చూడగానే విజయంపై నమ్మకం కలిగింది. ఇపుడు స్థిరమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

త్వరలో మరో కొత్త బేనర్

త్వరలో మరో కొత్త బేనర్

త్వరలో మరో కొత్త బ్యానర్‌ను స్థాపించబోతున్నాను. రెండు సంస్థలపై భిన్న కథాంశాలతో మా అభిరుచులకు అనుగుణంగా సినిమాలు చేయాలనుకుంటున్నాం. ప్రతి ఏడాది నాలుగైదు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం అన్నారు దిల్ రాజు.

దర్శకత్వం ఆలోచన

దర్శకత్వం ఆలోచన

దర్శకత్వం ఆలోచన ఉందా? అని ప్రశ్నించగా....ఇప్పటికైతే దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టే ఆలోచన లేదు. పనులన్నీ పక్కన పెట్టి రెండేళ్లు ఆలోచించాలి. ఇప్పుడు నాకంత టైమ్ లేదు అన్నారు. దిల్ రాజు మాటలు బట్టి భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందని స్పష్టమవుతోంది.

English summary
Tollywood producer Dil Raju interview about his latest release Supreme and upcoming movies.q
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X