పాత వ్యాపారంలోనే దిల్ రాజు ఫుల్ బిజీ?
జోష్, మరో చరిత్ర వరస ఫ్లాఫ్ లతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన పాత వ్యాపారం డిస్ట్రిబ్యుషన్ పైనే పూర్తి దృష్టి పెట్టారని సమాచారం. తాజాగా ఆయన రాజమౌళి, సునీల్ కాంబినేషన్ మర్యాద రామన్న, పూరీ,గోపీచంద్ ల గోలీమార్ చిత్రాల నైజాం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అలాగే షూటింగ్ జరుపుకుంటున్న మరిన్ని చిత్రాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ ఎంక్వైరీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా ప్రస్తుతం ఎన్టీఆర్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం, దశరధ్, ప్రభాస్ కాంబినేషన్లో మరో చిత్రామూ చేస్తున్నారు. వీటితో పాటు వేణు అనే దర్శకుడని పరిచయం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క కొత్త బంగారులోకం వంటి హిట్ ఇచ్చిన అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రెండో చిత్రం చేయటానికి ఆయన హీరోలకు కథలు వినిపిస్తున్నారు.
More from Filmibeat
దిల్ రాజు జోష్ మరో చరిత్ర వరుణ్ సందేశ్ అనిత గోలీమార్ మర్యాద రామన్న సునీల్ రాజమౌళి dil raju josh maro charitra varun sandesh anitha golimaar maryada ramanna


Click it and Unblock the Notifications











