పవన్-జూ ఎన్టీఆర్ క్రేజీ ప్రొజెక్ట్స్ తో నిజాం నవాబ్ అయిన దిల్ రాజు..!
పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణవర్థన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పంజా" చిత్రం డిసెంబర్ లో విడుదలకానుంది. ఈ సినిమాకి సంబంధించిన నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా మిరపకాయ్ చిత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గబ్బర్ సింగ్" చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులను కూడా దిల్ రాజు కైవసం చేసుకున్నాడని తెలుస్తోంది.
కాగా తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'దమ్ము" చిత్రాన్ని కూడా నైజాం ఏరియాలో పంపిణీ చేయబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. ఇలా టాప్ హీరోల క్రేజీ ప్రొజెక్టులను ఒక్క నైజాంలోనే ఒకే ఒక్క పంపిణీ దారుడు దిల్ రాజు కావడంతో అక్కడ్ నైజాం నవాబ్ అయిపోయాడంటున్న సినిమా ఇండస్ట్రీలో..
అంతే కాకుండా ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలను, క్రేజీ ప్రాజెక్ట్స్ ను పంపిణీ చేయబోతున్న దిల్ రాజు మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటు నిర్మాతగానూ, అటు పంపిణీ దారుడుగానూ దిల్ రాజు ఫుల్ జోష్ లో ముందుకుసాగుతున్నాడని పరిశీలకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











