Don't Miss!
- News
ప్రస్తుతానికి పర్వాలేదు.. తర్వాతేం జరుగుతుందో చూద్దాం!
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అజిత్ ఫ్యాన్స్ వివాదంపై దిల్ రాజు క్లారిటి.. నేనేమి తప్పు అనలేదు అంటూ..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల కాలంలో వరుసగా కొన్ని కాంట్రవర్సీల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ముఖ్యంగా వారసుడు సినిమాను మొదలుపెట్టినప్పటి నుంచి కూడా దిల్ రాజు పై అనేక రకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక సినిమా విడుదల సమయంలో కూడా ఇప్పుడు ఆయన కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల విజయ్ అజిత్ ఇద్దరి స్టార్ రేంజ్ ను పోలుస్తూ దిల్ రాజు చేసిన కామెంట్స్ కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై మరో ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

వారసుడు తెలుగు సినిమానే..
పండగ
సమయంలో
మొదట
తెలుగు
సినిమాలకు
థియేటర్స్
ఇచ్చిన
తర్వాతనే
ఆ
తర్వాత
ఇతర
హీరోల
సినిమాలకు
థియేటర్స్
ఇవ్వాలి
అని
మిగతా
నిర్మాతలు
కామెంట్
చేస్తూ
ఉండడంతో
దిల్
రాజు
దానికి
కూడా
సమాధానం
ఇచ్చారు.
వారసుడు
సినిమా
అనేది
ద్విభాష
చిత్రం
అంటూ
ఈ
సినిమాకు
వర్క్
చేస్తున్నది
ఒక
తెలుగు
దర్శకుడు
నిర్మిస్తున్నది
ఒక
తెలుగు
నిర్మాత..
అని
ఇది
కూడా
ఒక
తెలుగు
సినిమానే
అని
ఆయన
వివరణ
ఇచ్చారు.

ఎవరు ఆపలేరు
అలాగే సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టమైన పని అంటూ తను కెరీర్ మొదట్లో కూడా చాలా నష్టలను ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చినట్లు చెప్పారు. ఇండస్ట్రీలో ఎవరిని ఎవరు కూడా తొక్కరు అని ఇక్కడ టాలెంట్ ఉన్న వారిని కూడా ఎవరు ఆపలేరు అని దిల్ రాజు చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు కూడా ఎప్పుడు క్రేజ్ ఉంటుంది అని చెప్పారు.

ఎక్కువ థియేటర్స్ లేవు
మా
సంస్థలో
ప్రతి
ఏడది
కొన్ని
ఎక్కువ
సినిమాలు
వస్తాయి
కాబట్టి
కొంతమంది
డిస్ట్రిబ్యూటర్స్
ఎగ్జిక్యూటర్స్
కూడా
మాకు
ముందు
ప్రాధాన్యత
ఇస్తారు
అని
చెప్పిన
దిల్
రాజు
నైజాం
ఏరియాలో
తనకు
30కి
మించి
పెద్దగా
థియేటర్లో
లేవు
అని
ఈరోజు
నైజంలో
తాను
ఎక్కువ
థియేటర్లు
ఉన్నాయి
అనే
మాట
అవస్తవమని..
ఇక
నాకున్న
సినిమా
థియేటర్స్
లో
నా
బిజినెస్
చూసుకొని
సినిమాలు
వేసుకోవాలి
కాదా..
అని
దిల్
రాజు
చెప్పారు.

విజయ్ నెంబర్ స్టార్ కాబట్టి..
ఇక ఇటీవల దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో తమిళ హీరో అజిత్ ను తక్కువ చేస్తూ హీరో విజయ్ ను ఎక్కువగా పోగడారు అని కొన్ని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. వారసుడు సినిమా థియేటర్ల విషయంలో గురించి మాట్లాడిన దిల్ రాజు తమిళంలో విజయ్ నెంబర్ స్టార్ కాబట్టి అతని కంటే కొంత అజిత్ తక్కువ కాబట్టి వారసుడు సినిమా కోసం ఎక్కువ ధియేటర్లు అడిగినట్లుగా చెప్పారు. దీంతో అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు పై మండిపడ్డారు.

అజిత్ ను తక్కువ చేసి మాట్లాడలేదు
ఇక మొత్తానికి దిల్ రాజు అజిత్ పై చేసిన కామెంట్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయ్ తమిళ ఇండస్ట్రీలో గత ఐదారు సినిమాల నుంచి కూడా తన మార్కెట్ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఒక విధంగా అతని మార్కెట్ పరంగా చూస్తే ఎక్కువ ధియేటర్లు ఇవ్వాలి. అందుకోసమే నేను ఆరోజు ఆ విధంగా మాట్లాడాను. అంతేగాని అజిత్ ను తక్కువ చేసి మాట్లాడాలని నా ఉద్దేశం కాదు అని దిల్ రాజు సింపుల్ గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.