»   » టాలీవుడ్ టాప్ హీరోలంతా ఆ సినిమాలో..... మహేష్, ఎన్టీఆర్, బన్నీ అందరూ

టాలీవుడ్ టాప్ హీరోలంతా ఆ సినిమాలో..... మహేష్, ఎన్టీఆర్, బన్నీ అందరూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఖైదీనెంబర్‌ 150', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి బడా సినిమాల మధ్య తన సత్తా చాటడానికి సంక్రాంతికే వస్తోంది 'శతమానం భవతి'. శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ నాయకానాయికలుగా కనిపిస్తున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మించాడు. పెద్ద సినిమాల మధ్య వస్తున్న ఈ చిన్న సినిమాలో ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.

ఇంత భారీ పోటిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కారణం టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించటమే అన్న టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాలో మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లు స్వయంగా నటించలేదట. వాళ్లు నటించిన ఇతర చిత్రాల్లోని సీన్స్ ను ఈ సినిమాకు తగ్గట్టుగా ఎడిట్ చేసి వాడుతున్నారట.ఆయా సినిమాల్లో టాప్ హీరోలకి సంబంధించిన కొన్ని డైలాగ్ బిట్స్ ను కట్ చేసి .. వారందరి మధ్య సంభాషణ జరిగినట్టుగా ఒక సీన్ ను క్రియేట్ చేశారట. ఈ సీన్ లో మహేశ్ బాబు మొదలు స్టార్ హీరోలంతా కనిపిస్తారని అంటున్నారు. ఈ సీన్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని దిల్ రాజు చెబుతున్నాడు.

Dil raju Latest movie Shatamanam Bhavati to have top stars sparkles

అయితే ప్రేక్షకుల కు మాత్రం సినిమాలో ఆ హీరోలు స్వయంగా నటించారన్న భావన కలిగేలా ఆ సీన్స్ ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఇంత భారీ పోటిలో సినిమాను రిలీజ్ చేయడానికి ఆ సీన్స్ కూడా కారణంగా చెపుతున్నారు. ఆ బిట్‌లన్నింటినీ ఓ సీన్‌గా మార్చి వారు నిజంగా మాట్లాడుకున్నంత సహజంగా రూపొందించారట.

ఈ సీన్‌ సినిమాకు చాలా పెద్ద ప్లస్‌ అవుతుందని దిల్‌ రాజు భావిస్తున్నారట. స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కోసం స్టార్‌ హీరోల చేత క్యామియో రోల్స్‌ వేయించడం చూశాం కానీ, ఇలా అందర్నీ ఒకే సీన్‌లో చూపించాలనే ఐడియా మాత్రం కొత్తదే. మరి ఈ ఎడిటింగ్ మ్యాజిక్ శతమానంభవతి ఎంత వరకు కాపాడుతుందో చూడాలి.

'అమ్మాయిలను ఇంప్రెస్‌ చేస్తే పడరు. వాళ్లు ఇంప్రెస్‌ అయితే పడతారు' 'మన సంతోషాన్ని పది మందితో పంచుకుంటే బాగుంటుంది కానీ, మన బాధను పంచి వాళ్లను కూడా బాధ పెట్టడం ఎందుకు' 'ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే ప్రేమను వదులుకోవడం కాదు' అంటూ శర్వానంద్‌ చెప్పినన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

" శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది", అంటూ దిల్ రాజు చెప్పిన దగ్గరినుంచే ఈ సినిమా పై అంచనాలు మొదలయ్యాయి.

English summary
Stars like Mahesh Babu, NTR, Bunny, etc will sparkle in Dil raju Latest movie Shatamanam Bhavati, Mickey J Meyer is the music director for the film in which Sharwanand is romancing Malayalee beauty Anupama Parameswaran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu