»   »  పవన్ కళ్యాణ్ అయినా అంతకు మించి ఉండదంటున్న దిల్ రాజు!

పవన్ కళ్యాణ్ అయినా అంతకు మించి ఉండదంటున్న దిల్ రాజు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలనేది నా జీవిత లక్ష్యం అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మామూలు నిర్మాతల ఈ మాట అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ....దిల్ రాజు లాంటి బడా నిర్మాత నుండి ఇలాంటి కామెంట్ రావడం ఆశ్చర్యమే మరి.

పవన్ కళ్యాణ్ సినిమా అయినప్పటికీ నిర్మాణం విషయంలో నా పరిమితుల్లోనే ఉంటానని, పరిమితికి మించిన బడ్జెట్ పెట్టే ఆలోచన లేదని అంటున్నారట దిల్ రాజు. ఆయనతో చేసే సినిమా బడ్జెట్ 40 నుండి 50 కోట్ల మధ్యనే ఉంటుందని, లిమిట్స్ క్రాస్ అయ్యే సాహసం చేయను అంటున్నారు. పక్కా ప్రణాళితో... ఫిక్డ్స్ బడ్జెట్‌తో సినిమా తీస్తానని అంటున్నారట.

 Dil Raju limited Budget For Pawan Kalyan

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా నిర్మించాల‌నేది నా డ్రీమ్ కాదు.,, అది నా లైఫ్ యాంబిష‌న్. పవన్‌కళ్యాణ్‌గారు స్క్రిప్ట్‌ తీసుకురా..సినిమా చేద్దామని అన్నారు. అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వదిలి పెట్టను, ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నాను అని దిల్ రాజు తెలిపారు.

ఆయనతో సినిమా అంటే పర్ ఫెక్టుగా ఉండాలి. స్క్రిప్టు అదిరిపోయేలా ఉండాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అనేంత‌గా కథ కుద‌రాలి. ప్రస్తుతం ఆ పని జరుగుతోంది. కథ నాకు నచ్చిన విధంగా తయారైన తర్వాత..పవన్ కళ్యాణ్ గారికి వినిస్తాను. అక్కడ కూడా ఓకే అయితే సినిమా పట్టాలెక్కతుంది. అందుకు కాస్త సమయం పడుతుంది' అన్నారు.

English summary
Dil Raju is ready to produce a film with Pawan Kalyan and he is ready to shell out some 50 crores on it, but not more than that.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu