తెరపైకి దిల్ రాజు ‘లవర్’
హైదరాబాద్: హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ బేనర్‌లో 'లవర్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక యంగ్ హీరో కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి వాసువర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజు తెలియజేస్తూ 'వాసువర్మ చెప్పిన ఒక అద్భుతమైన కథతో ఈ 'లవర్ ' చిత్రాన్ని నిర్మిస్తున్నాము.
ఆల్ రెడీ సబ్జెక్ట్ కూడా పక్కాగా రెడీ అయిపోయింది. అతి త్వరలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలలో ఒక యంగ్ హీరో కథానాయకుడిగా నటించబోతని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వాసువర్మ. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు గతంలో వర్తు వచ్చినప్పటికీ.... ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
దిల్ రాజుకు సంబంధించిన ఇతర ప్రాజెక్టుల వివరాల్లోకి వెళితే.... ఆయన నిర్మాణ సారథ్యంలో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సంక్రాంతి సందర్భంగా రిలీజై మంచి విజయం సాధించింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ఈ చిత్రం దిల్ రాజు వాకిట్లో డబ్బుల కట్టలు కురిపిస్తోంది.
మరో వైపు దిల్ రాజు రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











