నామీద దిల్ రాజు ఎందుకలా...'మరోచరిత్ర' హీరోయిన్
'మరోచరిత్ర'కు హీరోయిన్ అనిత మైనస్ అంటూ 'దిల్'రాజు వ్యాఖ్యలు పబ్లిక్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయం నిన్న(సోమవారం) మీడియాను కలిసిన అనితను ముందుంచింది. ఆ వ్యాఖ్యలతో ఆమెకు భాద కలిగిందా అన్నదానికి "ఏమో...ఆయన ఎందుకలా అన్నారో, ఏ విషయంలో అన్నారో నాకైతే తెలియదు. ఆయనంటే నాకు ఎప్పటికీ గౌరవమే' అంటూ అనిత జవాబిచ్చారు. అలాగే నాకు దిల్ రాజుతో ఏ సమస్యా లేదు. అయితే ఆయన ఆ రకంగా భావిస్తే నేనేమీ కామెంట్ చేయలేను అంటోంది. అయినా వారందరికీ తెలుసు నేను అమెరికా నుంచి వచ్చాను. వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ తో పెరిగాను. అలాంటిది నాచేత సంప్రదాయబద్దమైన దుస్తులు తొడిగించారు. అది డెఫినెట్ గా ఆడ్ గా ఉంటుందనటంలో సందేహం లేదు. అలాగే నేను నా న్యాచురల్ లుక్స్ ఉన్నదున్నట్లుగా ప్రెజెంట్ చేస్తే బావుండేది. అప్పడు ఈ విధమైన విమర్శలు వచ్చేవి కావు. అయితే దర్శక, నిర్మాతలు ఆ పాత్రలో అలా నటించమన్నారు. నా తప్పేముంది అని ప్రశ్నిస్తోంది. ఆమె ఇంత క్లారిటీగా మాట్లాడటం చూస్తుంటే దిల్ రాజు తన ప్లాఫ్ కు కారణాలు అన్వేషించే క్రమంలో ఆమెపై నిందమోపుతున్నాడు అనిపిస్తుంది. ఇంకా మోటుగా చెప్పాలంటే ఆడలేక...మద్దెల ఓటు అన్న సామెతను గుర్తు చేసుకోవాలి.


Click it and Unblock the Notifications











