అల్లుడితో దిల్ రాజు సినిమా, రంగంలోకి బోయపాటి
హైదరాబాద్: అల్లుడు శ్రీను చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్...తొలి సినిమాతోనే టాలెంట్ పరంగా అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అని రెండో సినిమా గురించిన ప్రస్తావన మొదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండో సినిమాను తాను నిర్మిస్తానని ప్రకటించారు.
మరో వైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోసం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెండో సినిమా వైవిద్యంగా చేయడానికి మళ్లీ అమెరికా వెళ్లి కొత్త తరహా ఫైట్స్, ఇతర విషయాల్లో శిక్షణ తీసుకుంటానని సాయి శ్రీనివాస్ ఇటీవల ప్రకటించారు. మొత్తానికి తనను తాను ఇండస్ట్రీలో నిరూపించుకోవడానికి చాలా కష్ట పడుతున్నాడు అల్లుడు శ్రీను.

అల్లు శ్రీను సినిమా విషయానికొస్తే...మొత్తానికి బెల్లకొండ సురేష్ తనయుడు సాయిశ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం లక్ష్యం దాదాపుగా నెరవేరింది. ఒక విజయవంతమైన కమర్షియల్ సినిమాతో సాయి శ్రీనివాస్‌ను లాంచ్ చేయాలనుకున్న దర్శక నిర్మాతలు టార్గెట్ దాదాపుగా రీచ్ అయ్యారు. తొలి సినిమాలో సాయి శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించుకున్నాడు. డాన్సులు, పైట్లు బాగానే చేసాడు. కాస్త సానబెడితో మాస్ హీరో అవుతాడనే అభిప్రాయం అందరిలోనూ కల్పించాడు.
కాక పోతే సినిమా కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో 'అల్లుడు శ్రీను' తొలిరోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏది ఏమైతేనేం....ఈ ఫలితాలతో నిర్మాత బెల్లంకొండ సురేష్ సంతృప్తిగానే ఉన్నాడు. అయితే సినిమాకు అతిగా పెట్టిన ఖర్చు ఎంత వరకు తిరిగి వస్తుంది? లాభాలు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











