దమ్ము దిల్ రాజుకే ఉందన్న దర్శకుడు
తాను ఈ సంస్థలోనే పుట్టి పెరిగానని, అందుకే నా సక్సెస్ క్రెడిట్ మొత్తం సంస్థకే చెందుతుందని, ఇలాంటి కథలు రాయడానికి చాలామంది ఉన్నా... తీసే దమ్మ్తు దిల్ రాజుకే ఉందని దర్శకుడు వేణుశ్రీరామ్ అన్నారు. సిద్దార్ధ, దిల్ రాజు కాంబినేషన్ లో మళ్లీ అయిదేళ్ల తర్వాత వీరి కాంబినేషన్‌లో ఓ మై ఫ్రెండ్ చిత్రం రాబోతోంది. శ్రుతిహాసన్, హన్సిక ఇందులో నాయికలు. వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్‌లో జరిగింది.ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ఇలా స్పందించాడు. అలాగే మా సంస్థ నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోరుకుంటారో ఇది కచ్చితంగా అలాంటి సినిమా. యువతరం తమను తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో క్యారెక్టర్లు సాగుతాయి. ప్రస్తుతం యూత్‌లో ఉండే కన్‌ఫ్యూజన్ చుట్టూ కథ తిరుగుంది.
వేణుశ్రీరామ్ ఆర్య నుంచి మా సంస్థలోనే దర్శకత్వశాఖలో పనిచేసి అంచలంచెలుగా డెరైక్టర్ స్థాయికి చేరుకున్నాడు. తాను ఈ కథ చెప్పినప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. సిద్దార్థ్‌తో మేం చేసిన బొమ్మరిల్లు ఓ సంచలనం. అందుకే మా కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. ఇక ఇందులో శ్రుతిహాసన్ నటన ఫెంటాస్టిక్. ఈ సినిమా సాధించబోయే సక్సెస్ క్రెడిట్ మొత్తం తానే కొట్టేస్తుంది. మిగిలిన నటీనటులందరి నుంచి చక్కని నటన రాబట్టుకున్నాడు వేణు.రాహుల్‌రాజ్ అనే కొత్త మ్యూజిక్ డెరైక్టర్‌ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. అక్టోబర్‌లో ఆడియోను, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. ఇది కొత్త ప్రయోగం. సిద్దార్థ్‌తో పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని శ్రుతిహాసన్ చెప్పారు. కోప్రొడ్యూసర్స్: శిరీష్లక్ష్మణ్, లైన్ ప్రొదిలడ్యూసర్: అశోక్.


Click it and Unblock the Notifications











