దిల్ రాజు...రోటీ,కపడా అండ్ రొమాన్స్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో రోటీ,కపడా అండ్ రొమాన్స్ అనే టైటిల్ తో చిత్రం తీయబోతున్నారు. ఈ మేరకు ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో తమ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై టైటిల్ రిజిస్ట్రేషన్ చేసారు. అయితే ఈ చిత్రం ఎవరు డైరక్ట్ చేయబోతున్నారు, ఆర్టిస్టులు ఎవరనేది తెలియరాలేదు. ఇక ప్రస్తుతం దిల్ రాజు...ఎన్టీఆర్ తో బృందావనం చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుస్తున్నారు. అలాగే ప్రభాస్ హీరోగా దశరధ్ దర్శకత్వంలోనూ మరో చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











