యూత్ కోసంమే: శ్రీనివాస కళ్యాణం దర్శకుడితో.... ‘థాంక్యూ’ మూవీ చేయబోతున్న దిల్ రాజు!
సతీష్ వేగేశ్నతో గతేడాది 'శతమానం భవతి' సినిమా చేసి జాతీయ అవార్డు దక్కించుకున్న దిల్ రాజు ఈ ఏడాది 'శ్రీనివాస కళ్యాణం' అనే మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి యూత్ నుండి సరైన రెస్పాన్స్ రాలేదని స్వయంగా దిల్ రాజు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
యూత్‌ను మెప్పించేందుకు త్వరలో ఇదే దర్శకుడితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. సతీష్ వేగేశ్నతో కలిసి శ్రీనివాస కళ్యాణం సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన త్వరలో మా ఇద్దరి కాంబినేషన్లో 'థాంక్యూ' అనే సినిమా రాబోతున్నట్లు తెలిపారు. 'మీకు ఎలా చెప్పాలో' అనేది ఉపశీర్షిక.

"ఇటీవల నేను విన్న ఒక కథను సతీశ్‌కి చెప్పాను, ఆ కథ ఆయనకు కూడా నచ్చడంతో వెంటనే చేద్దాం అన్నారు. ఈ చిత్రంలో యూత్ కి నచ్చే అన్ని అంశాలు ఉంటాయి'' అని ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం 'థాంక్యూ' కథ డెవలప్మెంట్ దశలోనే ఉందని, త్వరలోనే పూర్తి స్క్రిప్టు సిద్ధం అవుతుంది. ఆ తర్వాత అన్ని విషయాలు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ఎవరు నటించబోతున్నారనేది ఇంకా డిసైడ్ చేయలేదన్నారు.
కాగా.. వీరి కాంబినేషన్లో వచ్చిన. శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. రూ. 27 కోట్లకు ఈచిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అమ్మగా ఫస్ట్ వీక్ 50 శాతం కూడా రికవరీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని టాక్.


Click it and Unblock the Notifications











