మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నెక్ట్స్ మూడు ప్రాజెక్టుల డిటేల్స్

By Srikanya

ప్రేక్షకుల పల్స్ పట్టుకుని వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న దిల్ రాజు తాజా చిత్రం మిస్టర్ ఫెరఫెక్ట్ రేపు(శుక్రవారం) విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన మరో మూడు స్క్రిప్టులు రెడీ చేయించారు. వాటిల్లో ఒకటి సిద్దార్ధ, శృతిహాసన్, హన్సిక కాంబినేషన్ లో వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందే ఓ మై ప్రెండ్ చిత్రం. ఈ చిత్రం ఆల్రెడీ సెట్స్ పై ఉంది. ఇక ఆ తర్వాత తన బ్యానర్ లో కొత్త బంగారులోకం చిత్రంతో విజయం అందించిన శ్రీకాంత్ అడ్డాల చిత్రం ఒకటి.అయితే ఈ చిత్రానికి ఇద్దరు హీరోలు అవసరమవుతారు. కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ తో ఈ చిత్రం అనుకున్నారు.అది కూడా త్వరలోనే సెట్స్ కు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటి తర్వాత మిస్టర్ ఫెరపెక్ట్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన హరి దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం కూడా త్వరలోనే మొదలు కానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X