Shaakuntalam: ఐ బొమ్మలో వచ్చినా శాకుంతలం చూడం.. దిల్ రాజు ప్రచారంపై దారుణంగా!
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్, పుష్ప మూవీలో ఊ అంటావా మావా ఐటమ్ సాంగ్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది స్టార్ హీరోయిన్ సమంత. ఈ రెండింటితో ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరగడంతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. గతేదాడి యశోద అదరగొట్టిన సమంత ఈసారి శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ క్రమంలో దిల్ రాజు చేపట్టిన ఓ ప్రచారంపై నెటిజన్లు దారుణంగా రియాక్ట్ అవుతున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్ వల్ల : స్టార్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా తెరకెక్కిన శాకుంతలం ఇప్పటికీ ఎన్నో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కానీ ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమాపై గ్రాఫిక్స్ పై విమర్శలు తలెత్తుతున్నాయి.

దిల్ రాజు సమర్పణ : అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాను డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్, కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో సందడి చేశారు.
పేలవంగా గ్రాఫిక్స్ : అంతేకాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ చిట్టి భరతుడి పాత్రలో అలరించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజవ్వగా మిశ్రమ స్పందన వస్తోంది. చాలా స్లోగా ఉందని, గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తుంటే మరికొందరు బాగుందని ప్రశంసిస్తున్నారు.
పైరసీకి నో.. : ఈ క్రమంలో దిల్ రాజు టీమ్ 'Say no to PIRACY' అని క్యాంపెయిన్ మొదలు పెట్టింది. "మూడేళ్లు మా రక్తాన్ని చెమటగా మార్చి తెరకెక్కించిన చిత్రం ఇది. మా కష్టాన్ని గుర్తించి థియేటర్లలో మాత్రమే చూసి ఆనందించండి. విజువల్ వండర్ ను ఫీలవ్వండి. పైరసీకి నో చెప్పండి" అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ కాగా.. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
వర్రీ అవ్వకు.. : 'నెగెటివ్ రివ్యూలు, వరస్ట్ ట్రైలర్, పైరసీలో కూడా చూడలేరు బ్రో. ఆవేశం ఎందుకు' అని నెటిజన్ అంటే.. 'నీ దుకాణం సర్దేయాలి. సినిమా అస్సారం అంటగా బయట టాకు' అని మరొకరు స్పందించారు.' HD వచ్చాక కూడా చూసేలా లేరు జనాలు. సో వర్రీ అవ్వాల్సిన పని లేదు' అని మరో నెటిజన్ సెటైర్ వేశాడు. 'నువ్ ఫ్రీ టికెట్లు ఇచ్చినా రాలేం నీ సినిమాకు' అని మరొకరు అన్నారు. 'ఐ బొమ్మలో (కొత్త సినిమాలు ప్రదర్శించే అనధికారిక సైట్) వచ్చినా చూడలేరు లే' అని మరొకరు ఘాటుగా సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











