భారీ రేటుకు దిల్ రాజు ‘సాహో’ డీల్... ఆశ్చర్యపోతున్న ట్రేడ్ వర్గాలు!
Recommended Video
నైజాం ఏరియాలో టాప్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు అంటే నిర్మాత దిల్ రాజును మించిన బెస్ట్ ఆప్షన్ లేదంటారు. పైగా దిల్ రాజు హస్తవాసి మంచి, ఆయన ద్వారా సినిమా రిలీజ్ అయితే పెద్ద హిట్టవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న 'సాహో' మూవీ రాజుగారి చేతికి రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
'సాహో' చిత్రాన్ని నిర్మిస్తున్న యూవి క్రియేషన్స్ అధినేతలు వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటితో దిల్ రాజుకు ముందు నుంచి క్లోజ్ రిలేషన్ ఉంది. ఈ నేపథ్యంలో నైజాం ఏరియాలో దిల్ రాజు ద్వారా తమ సినిమా రిలీజ్ అయితేనే బావుంటుందని వారు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు రూ. 45 కోట్ల ‘సాహో' డీల్
‘సాహో' చిత్రానికి సంబంధించి నైజాం, వైజాగ్ ఏరియా థియేట్రికల్ రైట్స్ దిల్ రాజు రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు ఏరియాలకు కలిపి ఈ స్థాయిలో బిజినెస్ జరుగడం భారీ మొత్తంగా ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

‘సాహో' స్థాయి ముందే ఊహించిన దిల్ రాజు
బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా స్థాయి ఎలా ఉంటుందని అంచనా వేయడంలో దిల్ రాజు ఎక్స్‌పర్ట్. ‘బాహుబలి' తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. ‘సాహో' మూవీ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న మెగా మూవీ. అందుకే దిల్ రాజు ఇంత భారీ మొత్తం పెట్టినట్లు తెలుస్తోంది.

హై ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ
‘సాహో' బడ్జెట్లో ఎక్కువ శాతం(రూ. 90 కోట్లు) యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేశారు. అబుదాబిలో 60 రోజుల పాటు చిత్రీకరించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్ కాబోతోంది. ‘షేడ్స్ ఆఫ్ సాహో' పేరుతో చాప్టర్ 1, చాప్టర్ 2 మేకింగ్ వీడియోలు విడుదల చేయగా... అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సాహో
‘సాహో' చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, ఎవలీన్ శర్మ, మురళీ శర్మ, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











