కొందరు హర్ట్ అయ్యారు, అది చేయాల్సింది కాదు, పవన్ మూవీ కోరిక తీరలేదు: దిల్ రాజు

'ఎఫ్ 2' విజయంతో దిల్ రాజు మంచి జోష్ మీద ఉన్నారు. తాజాగా ఆయన వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ ఛానల్‌తో మాట్లాడుతూ... నేను వర్క్ చేసిన స్టార్ హీరోల్లో హార్డ్ వర్కింగ్ బన్నీ అని, స్మార్ట్ నేచర్ ఉన్న వ్యక్తి జూ ఎన్టీఆర్ అని తెలిపారు.

నాతో ఇప్పటి వరకు పొగరుగా ప్రవర్తించిన వారు ఎవరూ లేరు, నా సినిమాల్లో చేసిన హీరోల్లో అలా నాకు ఎవరూ తగల్లేదు. బెస్ట్ ఎవరు? అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. అన్నీ కలిపి ఒక్కరిలో ఉండదు. ఒకరిని ఒకరితో కంపేర్ చేయలేమన్నారు.

నాలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ అవే... కొందరు హర్టవుతారు

నాలో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ అవే... కొందరు హర్టవుతారు

నాలో ఉన్న ప్లస్... అన్ని విషయాలను చాలా స్మూత్ డీల్ చేస్తూ బ్యాలెన్స్ ఔట్ అవ్వకుండా ముందుకు వెళ్లడం. మైనస్ పాయింట్... ప్రెస్ మీట్లలో ఏ విషయం అయినా ఓపెన్ గా చెప్పేయడం, దాని వల్ల కొందరు హర్ట్ అవుతారు. నేను మాలేక పోతున్నా అలవాటు ‘స్వీట్స్ తినడం' అని దిల్ రాజు తెలిపారు.

కావాలని ఎవరూ ఇబ్బంది పెట్టరు

కావాలని ఎవరూ ఇబ్బంది పెట్టరు

కావాలని ఎవరూ ఇబ్బంది పెట్టారు. కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ వల్ల, కొన్ని అనుకోని సంఘటనల వల్ల జరుగుతాయి. అలా ఇబ్బంది పడ్డ హీరోతో మళ్లీ సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది తాత్కాలిక సమస్య మాత్రమే అన్నారు.

రెమ్యూనరేషన్ పరంగా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు

రెమ్యూనరేషన్ పరంగా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు

రెమ్యూనరేషస్ పరంగా ఇబ్బంది పెట్టేవారు తగులుతూ ఉంటారు. ఇండస్ట్రీలో అది చాలా కామన్ సమస్య. నేను ఇప్పటి వరకు పని చేసిన దాదాపు అందరితో మళ్లీ సినిమా చేయాలనకుంటాను అని దిల్ రాజు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వపన్ కళ్యాణ్ ఓకే చెబితే

వపన్ కళ్యాణ్ ఓకే చెబితే

నేను చేయాలని కోరిక ఉండి చేయలేక పోయిన హీరో పవన్ క ళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఓకే చేస్తే అన్నీంటినీ పక్కన పెట్టి దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. బాగా నచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఆర్య, బొమ్మరిల్లు, మిస్టర్ పెర్ఫెక్ట్, శతమానం భవతి, ఫిదా, ఎఫ్ 2... ఇలా చాలా ఉన్నాయని తెలిపారు.

ఆ సినిమా చేయాల్సింది కాదు

ఆ సినిమా చేయాల్సింది కాదు

కొన్ని అటెమ్ట్ చేయాల్సింది కాదు.. అలా అటెమ్ట్ చేసిన సినిమా ‘మరో చరిత్ర'. బాగా లాభాలు తెచ్చిన సినిమా ఎఫ్ 2. బాగా నష్టాలు మిగిల్చిన సినిమాలు నాలుగైదు ఉన్నాయి. నా ఫిట్ నెస్ సీక్రెట్ వర్కౌట్ చేయడం, సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉండటమని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

‘ఒక్కడు' లాంటిది ఇంకా దొరకలేదు

‘ఒక్కడు' లాంటిది ఇంకా దొరకలేదు

నాతో పని చేసిన అందరూ ఫ్రెండ్లీ డైరెక్టర్లే... 90 శాతం నన్ను అర్థం చేసుకున్నవారితోనే చేశాను. 10 శాతం మందితో కొస్త డిఫరెన్సెస్ వచ్చాయి. ‘ఒక్కడు' సినిమా చూసినపుడు ఎప్పటికైనా ఇలాంటి సినిమా చేయాలనకున్నాను. కానీ ఇంకా అలాంటి స్క్రిప్టు కనెక్ట్ అవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X