Balagam ఫ్రీ షోలపై పోలీసులకు ఫిర్యాదు.. దిల్ రాజును దెప్పి పొడుస్తున్న నెటిజన్లు!

జబర్దస్త్ కమెడియన్ టిల్లు వేణు దర్శకుడిగా మారిన చిత్రమే బలగం (Balagam Movie). కమెడియన్ ప్రియదర్శి మరోసారి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్ గా చేసింది. దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ మూవీ మార్చి 3న విడుదలై విమర్శల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు వచ్చిన మౌత్ టాక్ తో పలు గ్రామాల్లో ఫ్రీ షోలు ఏర్పాటు చేశారు. తాజాగా బలగం ఫ్రీ షోలపై నిర్మాత దిల్ రాజు పోలీసు కంప్లయింట్ ఇచ్చారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని కథతో తెరకెక్కిన సినిమా 'బలగం'. ఓ కుటుంబంలో పెద్ద దిక్కు మరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని.. అంత్యక్రియలు, దశదిన కర్మ, పిట్టకు పెట్టుడు, ఆత్మీయుల మధ్య సాగే కలహాలు, అనుబంధాలు, మనస్పర్థలు, భావోద్వేగాల వంటి అంశాలతో బ్యూటిఫుల్ ఎమోషనల్ కామెడీ డ్రామాగా ఈ సినిమా వచ్చింది. మన ఇంట్లో కథ అన్నట్లుగా సాగే ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

Dil Raju Police Complaint Against Balagam Movie Free Shows In Villages

అయితే ఈ సినిమాతో కుటుంబంలో విడిపోయిన బంధాలు కూడా మళ్లీ కలుస్తాయన్న ఉద్దేశంతో పలు గ్రామాల్లో బహిరంగంగా షోలు నిర్వహించారు ఆ గ్రామ సర్పంచ్ లు, రాజకీయ వేత్తలు. ఇప్పుడు అదే రాద్దాంతంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు గ్రామాల్లో మొదలైన ఈ ఫ్రీ ఓపెన్ షోలు వందల సంఖ్యలో పల్లెటూళ్లకు పాకిపోవడంతో.. ఉచితంగా చూసేవారి సంఖ్య లక్షల్లోకి చేరిందని తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ స్క్రీనింగ్ కు సంబంధించిన పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ఫ్రీ షోల వల్ల థియేటర్ రెవెన్యూకు గండి పడుతోందని గుర్తించిన దిల్ రాజు తన నిర్మాణ సంస్థ తరఫున నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు అమెజాన్ ప్రైమ్ నుంచి చట్టవ్యతిరేకంగా డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా ప్రజలకు పంచి పెడుతున్నాయని, వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే నిజానికి ఎగ్జిబిషన్ యాక్ట్ ప్రకారం నిర్మాత అనుమతి లేకుండా వందల జనంలో సినిమా వేయడం ఇల్లీగలే అని సెక్షన్లు చెబుతున్నాయి.

Dil Raju Police Complaint Against Balagam Movie Free Shows In Villages

ఇదిలా ఉంటే దిల్ రాజు ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బలగం మూవీ సక్సెస్ మీట్ లో ఈ చిత్రాన్ని డబ్బు కోసం తీయలేదు. మానవ సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీశాను అని దిల్ రాజు చెప్పడాన్ని దెప్పు పొడుస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ విషయం ఎక్కడికి దారి తీస్తుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X