ప్రభాస్, దశరధ్ చిత్రంలో నటించాలనుందా?
'ఈ సినిమాతో కొంతమంది కొత్త వారిని పరిచయం చేయాలనుకుంటున్నాం. 35-40 సంవత్సరాల వయసున్న మహిళలు, మగవారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నాయనమ్మ పాత్రతో కూడా కొత్త వారిని పరిచయం చేయాలనుకుంటున్నాం' అంటున్నారు దిల్ రాజు. ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది. ఈ చిత్రంలో కొన్ని పాత్రలకు గానూ కొత్తవారిని పరిచయం చేయాలని దిల్ రాజు అనుకుంటున్నారు.
ఇక సంప్రదించాల్సిన వివరాలు...
శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్,
ప్లాట్ నెంబర్ 6,
హౌస్ నెంబర్ 8-3-988/6,
సత్య సాయి మండపం దగ్గరలో,
శ్రీనగర్ కాలనీ,
హైదరాబాద్ 500073.
ఫోన్: 953364188
ఈ మెయిల్: [email protected]
ఆసక్తి ఉన్నవారు స్వయంగా గానీ, మెయిల్ ద్వారా గానీ ఫోటోలతో సంప్రదించవచ్చు. బెస్టాఫ్ లక్.


Click it and Unblock the Notifications











