దిల్ రాజు ముందే పరిస్థితి ఊహించాడు... తెలివిగా ‘మహర్షి’ని తప్పించాడు!

Recommended Video

Real Reason Behind Maharshi Movie Release Date Change || Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహర్షి'. మే 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 25న విడుదల చేయాలనుకున్నారు. తర్వాత తమ నిర్ణయం మార్చుకుని రిలీజ్ మే నెలకు వాయిదా వేశారు.

అప్పట్లో దిల్ రాజు రిలీజ్ డేట్ వాయిదా అంశంపై స్పందిస్తూ... సమ్మర్ హాలిడేస్ అంటూ ఏవో కారణాలు చెప్పారు. కానీ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే అసలు విషయం అదికాదని, ఏప్రిల్ చివరి వారంలో బాక్సాఫీస్ వద్ద 'అవెంజర్స్-ది ఎండ్ గేమ్' రిలీజ్ పొంచి ఉండటం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

దిల్ రాజు ముందే ఈ పరిస్థితి ఊహించాడా?

దిల్ రాజు ముందే ఈ పరిస్థితి ఊహించాడా?

బాక్సాఫీస్ వ్యాపారంలో దిల్ రాజు తలపండిన మేధావి. ఎప్పుడు సినిమా విడుదల చేయాలి, ఇతర సినిమాల వల్ల తమ సినిమాలకు ఏమైనా ముప్పు ఉంటుందా? అని బేరీజు వేయడంలో ఎక్స్‌పర్ట్. ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ముందే ఊహించి... కావాలనే ‘మహర్షి' చిత్రాన్ని వాయిదా వేశారని టాక్.

థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్లు తగ్గుతాయి

థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్లు తగ్గుతాయి

అవెంజర్స్-ది ఎండ్ గేమ్ మూవీతో పాటు ‘మహర్షి' విడుదల చేస్తే థియేటర్ల సమస్యతో పాటు... ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే తెలివిగా ఏప్రిల్ చివరి వారం నుంచి మహర్షి సినిమాను తప్పించారని స్పష్టమవుతోంది. ఈ విషయం తెలియక విడుదలకు సిద్ధమైన నిఖిల్ ‘అర్జున్ సురవరం', మరికొన్ని చిన్న చిత్రాలు చివరి నిమిషయంలో రిలీజ్ వాయిదా వేసుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో అవెంజర్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే...

తెలుగు రాష్ట్రాల్లో అవెంజర్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే...

తెలుగు రాష్ట్రాల్లో ‘అవెంజర్స్-ది ఎండ్ గేమ్' మంచి వసూళ్లు సాధిస్తోంది. ఫస్ట్ వీకెంట్ అదరగొట్టినప్పటికీ సోమవారం వీక్ డే కావడంతో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సోమవారం(4 రోజులు) వరకు ఈ చిత్రం రూ. 30 కోట్లు రాబట్టింది. ఇక ఇండియా వైడ్ కలెక్షన్ పరిశీలిస్తే 4 రోజుల్లో రూ. 190 కోట్లు రాబట్టింది.

వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన మహేష్ బాబు

వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన మహేష్ బాబు

‘మహర్షి' షూటింగ్ ముగిసిన అనంతరం తన ఫ్యామిలీతో పాటు పారిస్ వెకేషన్ వెళ్లిన మహేష్ బాబు వారం రోజుల పాటు పర్యటించారు. మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మే 1 నుంచి మహర్షి చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. నెక్ట్స్ వీక్ సూపర్ స్టార్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X