మణి రత్నం మూవీ దిల్ రాజు సమర్పణలో...

By Bojja Kumar

హైదరాబాద్: విలక్షణ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ‘ఓకే కన్మణి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి తనయుడు దుల్కేర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

ఈ చిత్రాన్ని ‘ఒకే బంగారం' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వహిస్తుండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. మణిరత్నం హిట్టు రుచి చూసి చాలా కాలమైంది. ఈ చిత్రంపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు.

Dil Raju to present Mani Ratnam’s next

తొలుత తెలుగులో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశారు మణిరత్నం. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ సినిమాలోని పాత్ర తనకు అంతగా సరిపోదని రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు సమర్పణలోనే ఈ సినిమా తెలుగులో విడుదలవుతోందని టాక్. దిల్ రాజు సినిమా రైట్స్ తీసుకున్నారంటే మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X