Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీనివాస కల్యాణం.. అనుకున్న టైటిల్ ఇది కాదు, నితిన్ పెళ్లి చేసుకోకుంటే కొడతారు!
దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మాతగా ఏ చిత్రం వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే సినిమా చేస్తే ఆ చిత్రానికి ఉండే స్పందనే వేరు. నితిన్, రాశి ఖన్నా జంటగా శ్రీనివాస కళ్యాణం చిత్రం రూపొందుతోంది. ఆగష్టు 9 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మహానటి లాగే
ఇటీవలే మహానటి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర విడుదల తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయం సాధించింది. అదేవిధంగా ఆగష్టు 9 న బొమ్మరిల్లు చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. ఆ సెంటిమెంట్ తోనే శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని ఆగష్టు 9 న విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపాడు.
దిల్ నా పేరైపోయింది
నితిన్ తో చేసిన దిల్ చిత్రం తన పేరుగా మారిపోయింది దిల్ రాజు అన్నారు. శ్రీనివాసకల్యాణం లాంటి అద్భుతమైన చిత్రం కోసమే ఇన్నిరోజులు గ్యాప్ వచ్చిందని అన్నారు.
అనుకున్న టైటిల్
ఈ చిత్రంలో నితిన్ పాత్ర పేరు నివాస్, రాశి ఖన్నా పాత్ర పేరు శ్రీ. కాబట్టి శ్రీ వెడ్స్ నివాస్ అనే టైటిల్ పెడదామని మొదట అనుకున్నాం. కానీ సంప్రదాయబద్ధమైన చిత్రానికి టైటిల్ కూడా అదేవిధంగా ఉండాలని శ్రీనివాస కళ్యాణం టైటిల్ ఫిక్స్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు.
నితిన్ ని కొడతారు
ఈ చిత్రం విడుదలయ్యాక నితిన్ పెళ్లి చేసుకోకుంటే జనాలు కొడతారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆడియో వేడుకలో పెళ్లి విషయం గురించి నితిన్ వాళ్ళ అమ్మకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.